Vikram Lander Clicked : ‘ల్యాండర్’ విక్రమ్ మొట్టమొదటి ఫోటో ఇదిగో..
Vikram Lander Clicked : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగి.. 140 కోట్ల మంది భారతీయులు గర్వించేలా చేసిన మన ‘చంద్రయాన్ 3’ ల్యాండర్ విక్రమ్ ఫోటోను చూడండి..
- By Pasha Published Date - 03:06 PM, Wed - 30 August 23

Vikram Lander Clicked : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగి.. 140 కోట్ల మంది భారతీయులు గర్వించేలా చేసిన మన ‘చంద్రయాన్ 3’ ల్యాండర్ విక్రమ్ ఫోటోను చూడండి.. ఈ ఫొటోను రోవర్ ప్రజ్ఞాన్ ఇవాళ ఉదయం 7.35 గంటలకు తీసి పంపింది. తాజాగా దీన్ని ఇస్రో ట్విట్టర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు పోస్ట్ చేసింది. ల్యాండర్ విక్రమ్ ఫోటోను చూసి యావత్ దేశం గర్విస్తోంది. దీన్ని షేర్ చేసిన వెంటనే వేలలో వ్యూస్, లైక్స్, షేర్స్ వెల్లువెత్తాయి. చంద్రుడిపై ఇండియా పాగా వేసేలా చేసిన విక్రమ్ అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
Also read : Bangladesh: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..!
Chandrayaan-3 Mission | ISRO shares an image of Vikram Lander clicked by Pragyan Rover this morning. The image was taken by the Navigation Camera onboard the Rover (NavCam). pic.twitter.com/WYG0VPZzfy
— ANI (@ANI) August 30, 2023
రోవర్ ప్రజ్ఞాన్ తనలో ఉన్న నావిగేషన్ కెమెరాతో ఈ ఫొటోను (Vikram Lander Clicked) తీసింది. ఈ కెమెరాను బెంగళూరుకి చెందిన Electro-Optics Systems కంపెనీ తయారు చేసింది. చంద్రుడిపై ల్యాండ్ అయినప్పటి నుంచి ల్యాండర్ కు సంబంధించి రిలీజ్ అయిన మొదటి ఫోటో ఇదే. ఇప్పటివరకు రోవర్ ఫోటోలను ల్యాండర్ విక్రమ్ తీసి పంపగా.. తాజాగా రోవర్ తన కెమెరాతో ల్యాండర్ ఫోటోలను తీసి పంపింది. ట్విటర్‌లో విక్రమ్ ల్యాండర్ ఫొటోని షేర్ చేస్తూ.. “Image of the Mission” అంటూ ఇస్రో కామెంట్ చేసింది.