ISB : ఉత్తమ బిజినెస్ స్కూల్ గా ఐ.ఎస్.బి ఎంపిక..!
ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐ.ఎస్.బి ఉత్తమ బిజినెస్ బిజినెస్ స్కూల్ విభాగంలో అసోసియేషన్ ఆఫ్ ఎం.బి.ఏ నుంచి గుర్తింపు
- By Ramesh Published Date - 11:50 AM, Tue - 10 October 23

ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐ.ఎస్.బి ఉత్తమ బిజినెస్ బిజినెస్ స్కూల్ విభాగంలో అసోసియేషన్ ఆఫ్ ఎం.బి.ఏ నుంచి గుర్తింపు పొందింది. ఏ.ఎం.బి.ఏ నుంచి ఐ.ఎస్.బి రీ అక్రిడేషన్ ను పొందినట్టు తెలిపింది. ఈ సందర్భంగా ఐ.ఎస్.బి (ISB) డిప్యూటీ డీన్ ఆచార్య రామభద్రన్ తిరుమలై తమ సంస్థ లోతైన పరిశోధన, ప్రపంచ స్థాయి బోధన, నిపుణులైన అధ్యాపక బృందం తో పాటుగా అంతర్జాతీయ వసతులు ఉన్నాయి కాబట్టే సంస్థను ఉన్నంతగా ఉంచుతున్నాయని అన్నారు.
ఏ.ఎం.బి.ఏ (AMBA) నుంచి వరుసగా గుర్తింపు తెచ్చుకుంటున్న ఐ.ఎస్.బి ఒక్క ఏ.ఎం.బి.యే మాత్రమే కాదు ఈ.ఎం.ఎఫ్.డీ క్వాలిటీ ఇంప్రూవ్ మెంట్ సిస్టెం (ఈక్వీస్), అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్ కాలేజియెట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఏ.ఏసీ.ఎస్.బి) నుంచి కూడా గుర్తింపు సొంతం చేసుకుందని తెలిపారు. వీటి గుర్తింపు సాధన వల్ల ఐ.ఎస్.బి ప్రస్తుత, పూర్వ విద్యార్ధులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని డీన్ చెప్పారు.
ఏ.ఎం.బి.ఏ గుర్తింపు వల్ల ఇక్కడ చదివే విద్యార్ధుల ఉద్యోగ అవకాశాల్లో వృద్ధి, దేశ విదేశా నెట్ వర్కింగ్ లో 150 దేశాల పైగా 60 వేల మంది విద్యార్ధులతో ఏ.ఎం.బి.ఏ వరల్డ్ అసోసియేషన్ లో చేరేందుకు అవకాశం ఉంటుందని రామభద్రన్ చెప్పారు. ఐ.ఎస్.బీ లో విద్యార్ధులు ఎడ్యుకేషన్ పూర్తి చేసి వారికి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు అందుకునే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read : Ariana : ఆంటీ కామెంట్స్ పై అరియానా సీరియస్..!
We’re now on WhatsApp. Click to Join