Kabul Gurdwar : కాబుల్ గురుద్వార్ వద్ద పేలుళ్లతో ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధాలు..?
- By Vara Prasad Published Date - 11:20 AM, Sat - 18 June 22

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లోని గురుద్వారా కార్తే పర్వాన్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ దాడి వెనుక ఐసిస్ ఖొరాసన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కాబూల్ కాలమానం ప్రకారం ఉదయం 7:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు) దాడి ప్రారంభమైంది. ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారు.. ఆ తర్వాత వారిలో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గురుద్వారా దగ్గర ఉన్న గార్డు కాల్చి చంపబడ్డాడు. ముగ్గురు తాలిబాన్ సైనికులు గాయపడగా..ఇద్దరు దాడిదారులను తాలిబన్ సైనికులు అడ్డుకున్నారు. కనీసం 7-8 మంది ఇంకా లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
Related News

Up chemical factory:యూపీ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు…12కి చేరిన మృతుల సంఖ్య..!!
యూపీలోని హాపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12మంది మరణించారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఢిల్లీకి 60కిలోమీటర్ల దూరంలోని ధౌలానాలోని పారిశ్ర