Netanyahu : మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్
Netanyahu : ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఉద్ధృతంగా పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది.
- By Kavya Krishna Published Date - 12:13 PM, Sat - 14 June 25

Netanyahu : ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఉద్ధృతంగా పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులకు దిగింది. శనివారం అర్ధరాత్రి తరువాత ఇరాన్ ఒక్కసారిగా వందలాది బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్ దాడులకు పాల్పడింది. ఈ క్షిపణులు ప్రధానంగా జెరూసలేం, టెల్ అవీవ్ వంటి ప్రధాన నగరాల్లోని కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నగరాల్లో శబ్దాలు, కదలికలతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. పలుచోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్టు స్థానిక వార్తా ఏజెన్సీలు వెల్లడించాయి.
ఈ దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ తక్షణమే తన డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. డోమ్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేయడంతో మిస్సైళ్లలో చాలా భాగాన్ని మధ్యలోనే అడ్డగించారు. అయినప్పటికీ కొన్ని మిస్సైళ్లు లక్ష్యాలను తాకినట్టు తెలుస్తోంది. ఈ దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు గాఢమవుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు పరిస్థితిని గమనిస్తున్నాయని వార్తలు వచ్చాయి.
Chennai : ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
ఇరాన్ చేపట్టిన ఈ మిస్సైల్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పరిణామాలపై వివరించారు. భారత్ ఈ రెండు దేశాలతోనూ మైత్రి సంబంధాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌తో సాంకేతిక సహకారం, రక్షణ సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, ఇరాన్‌తోనూ ఆయిల్ , వ్యాపార పరంగా అనుబంధం కొనసాగుతోంది.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. భారత్ పొరుగు దేశాల మధ్య తలెత్తే సమస్యల విషయంలో సాధారణంగా తటస్థంగా ఉంటూ శాంతిని కోరే వైఖరినే అనుసరిస్తుంది. అయితే ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఫోన్ కాల్, మోడీ–నెతన్యాహు మధ్య సంభాషణ నేపథ్యంలో భవిష్యత్ రాజనీతిక దిశపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ అంతర్జాతీయంగా శాంతి భద్రతలకే ఒక సవాలుగా మారుతున్న వేళ, ప్రపంచ దేశాల దృష్టి ఈ యుద్ధ ప్రాంతం వైపే మళ్లింది. భారత్ వంటి శాంతికాముక దేశం ఈ సంక్షోభంలో మౌనంగా ఉండనుందా? లేక తటస్థంగా మోస్తరు రాజనీతిక మద్దతును ప్రకటించనుందా? అన్నది తేలాల్సిన అంశం
Russia Earthquake: రష్యాలో కురిల్ దీవుల్లో ఈ భూకంపం