Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా..?
- By HashtagU Desk Published Date - 09:13 AM, Wed - 2 March 22

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో దీనిపై విద్యా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ప్రారంభం అయ్యి, అదే నెల 28వ తేదీతో పరీక్షలు ముగిసేలా ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా జేఈఈ మెయిన్ పరీక్షల తేదీ ప్రకటనతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు డైలమాలో పడ్డారని సమచారం.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు జరపాలని జాతీయ పరీక్ష మండలి నిర్ణయించింది. దీంతో విద్యార్ధులు ఒకే రోజు జేఈఈ మెయిన్స్, ఇంటర్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 3 గంల నుంచి ఆరు గంటల వరకు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ జరుగుతాయి. దీంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పరీక్షలు మొత్తం వాయిదా వేయలా లేదా జేఈఈ మెయిన్స్ పరీక్షలకు అడ్డువచ్చిన ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేయాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం.