Instagram: ఇన్స్టాగ్రామ్ నుంచి కొత్త ఫీచర్…బల్క్ డిలీట్ ఆప్షన్…!
సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా టాప్ సోషల్ మీడియా యాప్ గా ఇన్ స్టాగ్రామ్ దూసుకుపోతోంది.
- By Hashtag U Published Date - 06:30 AM, Thu - 10 February 22
Instagram: సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ కు ఉన్న పాపులారిటీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ వైడ్ గా టాప్ సోషల్ మీడియా యాప్ గా ఇన్ స్టాగ్రామ్ దూసుకుపోతోంది. యూత్ టేస్ట్ కు తగ్గట్లుగా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేయడమే దీనికి కారణం. ఇక ఇన్ స్టాగ్రామ్ మరింత మంది యూజర్లకు చేరవయ్యేందుకు ఈ ఏడాది కొన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది. ఇంటర్నెట్ డే కార్యక్రమాల్లో భాగంగా ఇన్ స్టా నుంచి పోస్టులు, కామెంట్స్ తోపాటు ఇతర యాక్టివిటీస్ ను ఈజీగా డిలీట్ చేసేందుకు యూజర్లకు కొత్త ఫీచర్లను సెట్ చేసింది.
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ యాప్ ద్వారా లాంచ్ చేయనున్న కొత్త అకౌంట్ కంట్రోల్ తో ..యూజర్ ఇప్పుడు కామెంట్స్, పోస్టులను పెద్దమొత్తంలో ఒకేసారి డిలీట్ చేసే వెసులుబాటును కల్పించింది. అంతేకాదు తేదీ వారీగా కంటెంట్ కోసం కూడా సెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్స్ ను యూజర్ ప్రొఫైల్‌లోని యూవర్ ఆక్టివిటీ అనే న్యూ సెక్షన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ ఈ వారంలోనే టేక్ ఏ బ్రేక్ అనే ఫీచర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇన్ స్టా యూజర్లు ఇప్పుడు వారి కామెంట్స్, లైక్స్, స్టోరీ సిక్కర్ రియాక్షన్స్ వంటి వాటితోపాటు పలు పోస్టులు, స్టోరీలు, ఐజిటివి, రీల్స్ తో సహా మొత్తం కంటెంట్ ను బల్క్ గా డిలీట్ చేయవచ్చు. లేదా ఆర్కైవ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు వినియోగదారులు కూడా ఫిల్టర్ చేయవచ్చు. తేదీ వారీగా కంటెంట్ మరియు ఇతర యాక్టివిటీస్ ను సెర్చ్ చేయవచ్చు. ప్రస్తుతం రోల్ అవుట్ యూజర్లు ఈ మధ్యే ఆర్కైవ్ చేసిన లేదా డిలీట్ చేసిన కంటెంట్ ను గుర్తించేందుకు, సెర్చ్ హిస్టరీని చెక్ చేసేందుకు మరియు ఫ్లాట్ ఫాంలో యూజర్ గడిపిన సమయంతోపాటు సమాచారాన్ని డౌన్ లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఏదైనా పోస్టును తొలగించాలంటే…మ్యానువల్ గా వెళ్లాల్సిన పనిలేదు. మీ యాక్టివిటీని యాక్సెస్ చేసేందుకు మీ ప్రొఫైల్లోకి వెళ్లి టాప్ రైట్ కార్నర్ లో ఉన్న మెనూ బటన్‌ను ప్రెస్ చేయండి. అక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ ఫీచర్ ను ఇన్ స్టాగ్రామ్ గతేడాది చివరి నుంచి పరీక్షించి…ఈ ఏడాదిలో విడుదల చేసింది. ఫోటో షేరింగ్ యాప్ ప్రకారం, యూజర్లకు సంబంధించిన అకౌంట్స్ ను సురక్షితంగా ఉంచేందుకు మరియు వారి యాక్టివిటిస్ ను కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ కొత్త ఫీచర్ సహయపడుతుంది.
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.