Gutha Sukender Reddy: శాసన మండలి ఛైర్మన్ గుత్తా వాహనాలు తనిఖీ
- Author : Balu J
Date : 14-11-2023 - 5:34 IST
Published By : Hashtagu Telugu Desk
Gutha Sukender Reddy: మిర్యాలగూడ పట్టణంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై, నల్గొండ వస్తుండగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాహనాన్ని ,తన కాన్వాయ్ వాహనాలను తిపర్తి మండల కేంద్రంలోని చెక్ పాయింట్ వద్ద ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. శాసన మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న సరే తన వాహనాన్ని చెక్ చేస్తున్న పోలీసులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పూర్తిగా సహకారం అందించారు.
కాగా త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 608 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు అసంపూర్తిగా ఉన్నందున తిరస్కరించినట్లు పరిశీలన ప్రక్రియలో వెల్లడైంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 5,716 నామినేషన్లు దాఖలు చేసిన 4,798 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు.