PM Modi: భారత్‌ను వికసిత్ భారత్‌గా మలిచేందుకు పాటుపడుతున్నాంః ప్రధాని
- By Latha Suma Published Date - 04:09 PM, Fri - 1 March 24

PM Modi: జార్ఖండ్(Jharkhand)లోని ధన్‌బాద్(Dhanbad)లో శుక్రవారం జరిగిన ర్యాలీ(Rally)ని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడుతూ..వికసిత్ భారత్(Vikasit Bharat)లక్ష్యాల దిశగా వేగవంతమైన వృద్ధిని సాధిస్తూ భారత్ దూసుకువెళుతోందన్నారు. గత పదేండ్లుగా జార్ఖండ్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, గిరిజనులు, పేదలు, యువత, మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నామని వివరించారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) చెబుతూ భారత్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. గత క్వార్టర్‌లో భారత్ ఏకంగా 8.4 శాతం వృద్ధి సాధించిందని తాజా గణాంకాలను ఉటంకిస్తూ ప్రధాని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
2047 నాటికి భారత్‌ను వికసిత్ భారత్‌గా మలిచేందుకు పాటుపడుతున్నామని చెప్పారు. వికసిత్ భారత్ సాధనకు జార్ఖండ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తయారుచేయడం కూడా కీలకమని అన్నారు. జార్ఖండ్ పురోభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
read also : Krish: డ్రగ్స్ కేసు.. తెలంగాణ హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్