Ambedkar Statue: ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం…క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..!!
హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేడ్క్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రూ.
- By Hashtag U Published Date - 12:18 PM, Thu - 14 April 22
హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ పై 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల అంబేడ్క్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రూ. 1400కోట్ల ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఈ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 2ను కూడా విడుదల చేసింది. అయితే ఈ జీవో విడుదలై చాలా రోజులు గడిచింది. అయినా విగ్రహం పనులు ఇంకా పూర్తికాలేదు. దీంతో ప్రతిపక్షాలు, దళిత సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విగ్రహం ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండపై 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసే 125 అడుగుల కాంస్య విగ్రహ నమూనాను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఢిల్లీలో అంబేడ్కర్ విగ్రహం తయారు అవుతుందని వెల్లడించారు. ఈ విగ్రహం తయారీని ప్రజాప్రతినిధులు పరిశీలించనున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద అంబేడ్క్ విగ్రహంగా చరిత్ర సృష్టించనుందని చెప్పారు.
"Life should be great rather than long" – Dr BR Ambedkar
Humble respects to the Great leader who, by way of Article 3 in Indian Constitution, has paved way for creation of Telangana 🙏#AmbedkarJayanti pic.twitter.com/ECOiNkOuMy
— KTR (@KTRBRS) April 14, 2022