Sri Ram Navami: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా పోలీసుల కీలక సూచనలు
- By Balu J Published Date - 08:07 PM, Fri - 12 April 24

Sri Ram Navami: శోభాయాత్ర నిర్వాహకులకు పలు సూచనలు చేసారు పోలీసులు. శ్రీరామనవమి శోభాయాత్ర ఈనెల 17న సీతారాం భాగ్ నుండి ప్రారంభమవుతుంది. ఎన్నికల కోడ్ దృష్ట్యా రాత్రి 10 లోపు శోభాయాత్ర పూర్తి చేయాలి అని కోరుతున్నారు పోలీసులు. కళ్యాణం 10 గంటల సమయానికి పూర్తి చేసి శోభాయాత్ర ప్రారంభం చేస్తే త్వరగా పూర్తి చేయొచ్చు అని సూచించారు. ఈ సందర్భంగా విగ్రహాల ఊరేగింపుకు పెద్ద టస్కర్ వాహనాలు వినియోగించొద్దు అని సూచించారు.శోభాయాత్రలో పెద్దపెద్ద డీజే శబ్దాలు లేకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.
ప్రదర్శనలో ఇతర వర్గాలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. రోడ్డుకు ఇరువైపులా ప్రసాదాల వితరణ కేంద్రాలు వల్ల కూడా శోభాయాత్ర ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కావున ప్రసాదాల వితరణ కేంద్రాలు జిగ్జాగ్ ఏరియాలో పెట్టుకోవాలని సూచించారు. ఊరేగింపుకు ఇబ్బంది లేకుండా రోడ్డుకు ఇరువైపులా డయాస్లు వేసుకోవాలన్నారు. శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలానే భక్తులు సహకరించాలి అని పోలీసులు చెప్తున్నారు.శ్రీరాముడి శోభాయాత్రలో పొలిటికల్ స్పీచ్ ఉండకూడదు అని తెలిపారు. రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు ప్రదర్శించకూడదన్నారు.