RC: మీ వెహికిల్ ఆర్సి పోయిందా? అయితే ఇలా అప్లై చేసుకోండి!
సాధారణంగా వాహనదారులకు ఆర్సి అన్నది చాలా ముఖ్యమైనది. ఆర్సి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అని అర్థం.
- By Nakshatra Published Date - 05:20 PM, Sat - 5 November 22
సాధారణంగా వాహనదారులకు ఆర్సి అన్నది చాలా ముఖ్యమైనది. ఆర్సి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అని అర్థం. సాధారణంగా మనకు పోలీసులు ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఆర్సి ఉందా లైసెన్స్ ఉందా అని అడుగుతూ ఉంటారు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పై వాహన పూర్తి వివరాలలో ప్రింట్ చేసి ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్సి లో ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ తో పాటు ఆ వాహన ఓనర్ సమాచారం కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ఈ ఆర్సి పోగొట్టుకుంటూ ఉంటారు.
కానీ దానిని ఎలా తిరిగి పొందాలి అన్న విషయం మనలో చాలామందికి తెలియదు. మరి పోగొట్టుకున్న ఆర్సి ని తిరిగి ఏ విధంగా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఇందుకోసం మొదట ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ అఫిషియల్ వెబ్సైట్ ను ఓపెన్ చేసి ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ కింద వెహికిల్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పై వెబ్ సైట్ మీ స్టేట్ వెహికిల్ ట్రాన్స్ పోర్ట్ వెబ్సైట్ కి మళ్లించబడుతుంది. అప్పుడు ఒక పాప్ అప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. ఆ తరువాత వెహికిల్ సర్వీసెస్ కింద ఉన్న ఇష్యూ డూప్లికేట్ ఆర్సి ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అప్పుడు మీరు అకౌంట్ ఉంటే లేదా రిజిస్టర్ చేసుకోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వా ఆన్లైన్ సర్వీసెస్ కింద వెహికిల్ సర్వీసెన్ ఆప్షన్ ఎంచు కోవాలి. అనంతరం వాహన వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఓటిపి ని కూడా ఎంటర్ చేయడం ద్వారా వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. అయితే ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత స్క్రీన్ పై మనకు కొన్ని ఆన్లైన్ సర్వీస్ చూపించినప్పుడు ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ ఆర్సి ఆప్షన్ ఉంచుకొని సబ్మిట్ పై నొక్కాలి. ఫారమ్ నింపిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ రూపొందించబడుతుంది.
దీని తర్వాత ఈ సంతకం చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అప్పుడు మీరు e-KYC పూర్తి చేసి పేమెంట్ చేయాలి. ఆర్ టిఓ దరఖాస్తును ఆమోదించిన తర్వాత వారు స్పీడ్ పోస్ట్ ద్వారా డూప్లికేట్ ఆర్సి మీ అడ్రస్ కి పంపుతారు.
Tags
Related News
Harish Rao: మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు
మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ ని పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులకు పూర్తిగా మంత్రి సహకరించారు.