Vastu Tips : తల్లితండ్రులతో గృహప్రవేశం చేయిస్తే లాభమా.. నష్టమా?
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఇంటిని నిర్మించుకోవడం అన్నది ఒక కల. ఇక చాలామంది ఇంటిని నిర్మించుకునే
- By Nakshatra Published Date - 07:45 AM, Sun - 14 August 22
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఇంటిని నిర్మించుకోవడం అన్నది ఒక కల. ఇక చాలామంది ఇంటిని నిర్మించుకునే విషయంలో ప్రతి ఒక్కరూ అనేక రకాల కలలు కంటూ ఉంటారు. లైఫ్ లో మంచి స్థాయికి ఎదగడంతోపాటు సొంతంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది జీవితంలో సొంతింటి కల అన్నది కలగానే మిగిలిపోతూ ఉంటుంది. కానీ కొందరు మాత్రం అదృష్టవశాత్తు వారు అనుకున్న విధంగా ఇంటిని అందంగా వారికి నచ్చిన విధంగా నిర్మించుకుంటూ ఉంటారు.
అయితే ఇంటిని నిర్మించిన తర్వాత గృహప్రవేశం తప్పనిసరి. అయితే ఈ గృహప్రవేశం విషయంలో చాలామంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న వారి చేత గృహప్రవేశం చేపించే ముందు ఒకటికి రెండుసార్లు పూజారిని అడిగి ఎవరి చేత గృహప్రవేశం చేయిస్తే బాగుంటుంది అని తెలుసుకొని మరి గృహప్రవేశం చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన ఆ గృహ యజమానులు చేస్తారు. అప్పుడు వారి పేరు నక్షత్రం ఆధారంగా గృహప్రవేశం ముహూర్తాన్ని నిర్ణయిస్తారు.
అయితే గృహప్రవేశ సమయానికి ఎవరైతే పూజలో కూర్చుంటారో వారి నామ నక్షత్రాల్లో మొదటి అక్షరాన్ని తీసుకొని ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. ఈ ప్రకారంగా తల్లిదండ్రులు, అత్తమామలు, భార్యాభర్తలు ఎవరైనా కూడా గృహప్రవేశం చేయవచ్చు. అయితే గృహప్రవేశం చేసే ముందు తప్పనిసరిగా సిద్ధాంతులను సంప్రదించడం మంచిది. గృహ ప్రవేశం చేసే ముందు సిద్ధాంతాలను సంప్రదించి మీ పేరు నక్షత్రం ఆధారంగా ముహూర్తం బాగుందా లేదా అడిగి ఒకవేళ మీ పేరున బాగోలేకపోతే ఇంట్లో ఎవరి పేరు మీద అయితే బాగుంటుందో వారి చేత గృహప్రవేశం బాగుంటుంది.
Related News
Parents: పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులకు బాధ్యతలు ఉంటాయి.. అవేంటో తెలుసా
Parents: పిల్లల పెంపకంలో తల్లి, తండ్రి ఇద్దరూ కలిసి క్రమశిక్షణను పాటిస్తే, పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు. వారి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు పెద్దయ్యాక పేరెంట్స్ కు కొన్ని ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. తల్లి ఎంత కష్టపడి పని చేసినా, తండ్రులు మాత్రమే తమ పిల్లలకు నేర్పించగలిగే కొన్ని విషయాలు ఉంటాయని చైల్డ్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇందులో