COVID-19: కరోనా తరువాత ఆకస్మిక మరణాలు.. ICMR రీసెర్చ్
కరోనా వైరస్ ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ వైరల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. కోట్లాది మంది ఈ వైరస్ భారీన పడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 01:59 PM, Sat - 19 August 23

COVID-19: కరోనా వైరస్ ప్రపంచాన్నే కుదిపేసింది. ఈ వైరల్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. కోట్లాది మంది ఈ వైరస్ భారీన పడ్డారు. 2019లో చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసింది. అయితే దీన్ని ప్రపంచ దేశాలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయి. కరోనా వైరస్ వాక్సిన్ వేసుకున్న వారు ఎక్కువగా అనారోగ్యభారీన పడుతున్నట్టు నివేదికలు వచ్చాయి. దీనిపై ఎలాంటి అధరాలు లేవు. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆకస్మిక మరణాలపై రీసెర్చ్ మొదలుపెట్టింది. ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారి మరణాలపై విచారణ చేస్తున్నారు.
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సమ్మిట్ సందర్భంగా రాజీవ్ బెహ్ల్ ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక మరణాలను చూస్తున్నామని అన్నారు. COVID-19 వ్యాప్తి యొక్క పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనాలు మాకు సహాయపడతాయని ఆయన అన్నారు. అదనంగా, ఇది ఇతర మరణాలను నిరోధించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. పరిశోధన సంస్థ ఇప్పటివరకు న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో 50 శవపరీక్షలను అధ్యయనం చేసింది . రాబోయే కొద్ది నెలల్లో మరో 100 శవపరీక్షలపై రీసెర్చ్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకుంది. కోవిడ్ తరువాత మానవ శరీరంలో ఏవైనా మార్పులు వచ్చాయా అన్న దానిపై ICMR రీసెర్చ్ చేస్తుంది.
Also Read: WWE – Hyderabad : హైదరాబాద్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్.. గంటల్లోనే టికెట్స్ ఖాళీ