Volcano Video : బద్దలైన అగ్నిపర్వతం.. లావా ఎలా ఎగిసిపడిందో చూడండి
Volcano Video : ఐస్‌లాండ్ రాజధాని రెక్జావిక్‌కు దక్షిణంగా ఉన్న అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం జరిగింది.
- Author : Pasha
Date : 19-12-2023 - 9:22 IST
Published By : Hashtagu Telugu Desk
Volcano Video : ఐస్‌లాండ్ రాజధాని రెక్జావిక్‌కు దక్షిణంగా ఉన్న అగ్నిపర్వతంలో భారీ విస్ఫోటనం జరిగింది. సోమవారం అర్ధరాత్రి టైంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేక్జాన్స్ ద్వీపకల్పంలో గ్రిండావిక్‌కు ఉత్తర భాగంలో ఉన్న అగ్నిపర్వతం పేలింది. గత కొన్ని వారాలుగా అగ్నిపర్వతం పరిసరాల్లోని ప్రాంతాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. త్వరలో సంభవించబోయే అగ్నిపర్వత విస్ఫోటనాలకు ఈ భూకంపాలు సంకేతమనే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వచ్చారు. చివరకు అదే జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఐస్‌లాండ్ దేశంలోని అగ్నిపర్వతాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు(Volcano Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
అగ్నిపర్వతం పేలిన తర్వాత నారింజ రంగు లావా ప్రవాహం ఎగిసిపడుతున్న సీన్‌లు కనిపించాయి. ఆ ప్రాంతాన్ని ఎర్రటి పొగలు కమ్మేశాయి. హెలికాప్టర్లతో అగ్నిపర్వత పరిసర ప్రాంతాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి ఐస్‌లాండ్‌లోని రేక్జాన్స్ ద్వీపకల్పంలో 2021 సంవత్సరం వరకు ఒక్కసారి కూడా అగ్నిపర్వతం పేలలేదు. 2021 నుంచి ఇప్పటివరకు ఈ ద్వీపకల్పంలో మూడు సార్లు అగ్నిపర్వతాలు పేలాయి. ఐరోపా దేశం ఐస్‌లాండ్‌లో అత్యధికంగా 33 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి.
Also Read: Advani – Ram Mandir : రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దు.. అద్వానీ, జోషిలకు ట్రస్ట్ విజ్ఞప్తి
WATCH: Volcano erupts in Iceland, lava shooting into the air from fissure extending 2.5 miles (4 km) pic.twitter.com/M93QePO4wK
— BNO News (@BNONews) December 19, 2023