IAS harassment: కట్నం కోసం భార్యను వేధించిన ఐఏఎస్ అధికారి
మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
- By Hashtag U Published Date - 12:40 PM, Thu - 28 April 22
మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదైంది. భోపాల్‌లోని మహిళా పోలీసులు ఐఏఎస్ అధికారి మోహిత్ బుండాస్‌పై సెక్షన్ 498 A, 324, 506/34 కింద కట్నం, వేధింపులు, భార్యను కొట్టడం వంటి కేసులను నమోదు చేశారు. మంగళవారం రాత్రి ఐఏఎస్ అధికారి బుండాస్‌పై అతని భార్య ఫిర్యాదు చేసిందని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ నిధి సక్సేనా తెలిపారు. ప్రాథమిక విచారణలు జరిగిన తరువాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు.
బుండాస్ 2011 క్యాడర్ ఎంపీ బ్యాచ్ అధికారి, ప్రస్తుతం అటవీ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.ఆయన ఛతర్‌పూర్‌తో సహా అనేక జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశాడు. అక్కడ ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఆయన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. భోపాల్‌లో అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌గా కూడా పనిచేశారు. ఐఏఎస్ అధికారి మోహిత్ బుండాస్ భార్య కూడా ఐఆర్ఎస్ అధికారిణిగా ఉన్నారు.