Lady Aghori : పవన్‌ను కలిసేదాక వెళ్ళను.. మంగళగిరి రోడ్డుపై మహిళా అఘోరి హల్ చల్
ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని మహిళా అఘోరి చెప్పింది. అంతేకాక..పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ అఘోరి నినాదాలు చేసింది.
- By Latha Suma Published Date - 12:30 PM, Mon - 18 November 24

Mangalagiri Road : గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో మహిళా అఘోరి అలియాస్ శ్రీనివాస్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు అఘోరి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని అఘోరి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మహిళా అఘోరి మంగళగిరి రహదారిపై హల్ చల్ చేసింది. జనసేన ఆఫీసు సమీపంలో హైవేపై బైఠాయించి పవన్ కల్యాణ్ ను కలిసేదాకా కదలనని తేల్చిచెప్పింది. ఆలయ భూములు పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ ను కోరతానని మహిళా అఘోరి చెప్పింది.
అంతేకాక..పవన్ కళ్యాణ్ రావాలి… అంటూ అఘోరి నినాదాలు చేసింది. అఘోరీ నిరసనతో రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆమెను అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై అఘోరి చేయిచేసుకుంది. అయితే వాహనదారులు అఘోరీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించడం వల్ల ఎంతో మందికి ఇబ్బంది అవుతోందని మండిపడుతున్నారు. కావాలంటే జనసేన కార్యాలయం ముందు ధర్నా చేసుకోవాలని వాహనదారులు చెబుతున్నారు.
ఇక, అంతకుముందు ఈ మహిళా అఘోరి మంగళగిరిలోని ఓ కార్ వాష్ సెంటర్ లో తన కారును శుభ్రం చేయించుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఓ జర్నలిస్టు తన మొబైల్ కెమెరాలో అఘోరిని వీడియో తీశాడు. ఇది చూసి అఘోరి మండిపడింది. ఆ జర్నలిస్టుపై త్రిశూలంతో దాడి చేసింది. అడ్డు వచ్చిన వారిపైనా దాడి చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: Maharashtra Assembly Elections 2024 : మోడీని ఆ మాటలతో అవమానించారు – పవన్ కళ్యాణ్