Flight: గాల్లో విమానం ఉండగా పైలట్ సీట్లోకి నాగుపాము.. ఏం చేశారంటే..?
గాల్లో విమానం ఉండగా పైలట్ సీట్‌లోకి విషపూరిత పాము వచ్చింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. విమానంలోకి పాము రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
- By Anshu Published Date - 09:36 PM, Thu - 6 April 23

Flight: గాల్లో విమానం ఉండగా పైలట్ సీట్‌లోకి విషపూరిత పాము వచ్చింది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. విమానంలోకి పాము రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పైలట్ తో సహా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పైలట్ సీట్లోకి పాము రావడంతో అతడు షాక్ కు గురయ్యాడు. విమానంలోని ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు.
విమానంలోకి వచ్చింది నాగుపాముగా తెలుస్తుంది. నాగుపాము వచ్చినా పైలట్ అలాగే విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేశాడు. ఎటువంటి బెదురు లేకుండా నిగ్రహంతో విమానాన్ని అత్యవసర ల్యాడింగ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. దక్షిణాఫ్రికాలోని వోర్సర్టర్ నుంచి నెల్‌స్పూయిట్‌కు ఈ విమానం బయలుదేరింది. అయితే 11 వేల అడుగుల ఎత్తులో విమానం ఉన్న సమయంలో పైలట్ రుడోల్ప్ ఎరాస్మస్ సీట్‌లోకి విమానం వచ్చేసింది. అతడి నడుమున ఏదో చల్లగా తగులుతున్నట్లు అనిపించింది. దీంతో అటువైపు తిరిగి చూడగా నాగుపాము ఉంది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.
నాగుపాము ఉండటంతో ఏం చేవాలో అర్థం కాలేదు. వెంటనే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాడు. దీంతో జోహన్నెస్ బర్గ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చారు. దీంతో పైలట్ తో పాటు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విమానం ల్యాండ్ చేసిన తర్వాత పైలట్ సీటు జరిపి చూడగా నాగుపాము చుట్టచుట్టుకుని కనిపించింది.
అయితే విమానం బయలుదేరే ముందే సిబ్బంది నాగుపామును గుర్తించారు. దానిని పట్టుకునేందుకే ప్రయత్నించారు. చివరిక అది పారిపోయింది. ఎంతసేపు వెతికినా కనిపించలేదు. దీంతో బయటకు వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది అనుకున్నారు. అయితే గాల్లోకి విమానం వెళ్లగానే పైలట్ కు పాము కనిపించింది.