HYDRAA : కోకాపేటలో హైడ్రా యాక్షన్.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
- Author : Prasad
Date : 26-05-2026 - 12:56 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు కొనసాగిస్తుంది. గండిపేట్ మండలం కోకాపేటలోని కొత్త చెరువు పరిధిలో హైడ్రా (HYDRAA) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్స్, తాత్కాలిక కట్టడాలను అధికారులు తెల్లవారుజామున జేసీబీల సహాయంతో కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య చేపట్టిన ఈ ఆకస్మిక ఆపరేషన్‌తో స్థానికంగా కలకలం రేగింది. కూల్చివేతల అనంతరం ఆ స్థలాన్ని మళ్లీ ఎవరూ ఆక్రమించకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను కూడా అధికారులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని చెరువులు, జలవనరులను పరిరక్షించడంలో భాగంగా ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు హైడ్రా అధికారులు హెచ్చరించారు.