Hyderabad: ఆ….మసాజ్ సెంటర్ల జోలికి పోలీసులు వెళ్ళకూడదు
స్పా, మసాజ్ కేర్ సెంటర్ల వ్యాపార కార్యకలాపాలను మూసేయకుండా క్రమబద్ధీకరించాలని నగర పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
- By Praveen Aluthuru Published Date - 12:13 AM, Fri - 15 September 23

Hyderabad: స్పా, మసాజ్ కేర్ సెంటర్ల వ్యాపార కార్యకలాపాలను మూసేయకుండా క్రమబద్ధీకరించాలని నగర పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండే కేంద్రాలు తమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోర్టు పేర్కొంది. పోలీసులు తమ దైనందిన వ్యవహారాల్లో తరచూ జోక్యం చేసుకుంటున్నారని, చట్టంలోని ఎలాంటి విధానాన్ని పాటించకుండా బలవంతంగా మూసివేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ సోమార వెల్‌నెస్ అండ్ స్పా సెంటర్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. పిటిషన్‌ను విచారించే సమయంలో హైకోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉండేలా పోలీసులను ఆదేశించింది.
Also Read: Hyderabad: జీహెచ్‌ఎంసీ శానిటేషన్ వింగ్ అధికారులు అరెస్ట్