Hyderabad: చెప్పుల కోసం తమ్ముడిని హత్య చేసిన అన్నయ్య
హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
- By Praveen Aluthuru Published Date - 10:36 PM, Tue - 6 February 24
Hyderabad: హైదరాబాద్ లో దారుణం జరిగింది. చెప్పుల కోసం సొంత సోదరుడినే కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వస్తువుల కోసం రక్తబందాన్ని తెంచుకోవడం, అదీ హత్య చేయడం ఆందోళన కలిగించే అంశం. వివరాలలోకి వెళితే..
హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గొడవతో ఓ వ్యక్తి తన సోదరుడిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెప్పుల కోసం తమ్ముడిపై అన్నయ్య దాడి చేయడంతో ఈ దారుణం జరిగింది. తమ్ముడు వెంటనే అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Hyderabad: మూసీ అభివృద్ధిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సింగపూర్ కంపెనీ