Hyderabad University Jobs : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 95 జాబ్స్
Hyderabad University Jobs : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్, అకడమిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- By Pasha Published Date - 07:22 AM, Tue - 12 September 23
Hyderabad University Jobs : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 95 నాన్ టీచింగ్, అకడమిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, డిప్యూటేషన్ ప్రాతిపదికన ఈ జాబ్స్ కు సంబంధించిన రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. తగిన విద్యార్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి. అప్లికేషన్లను ఆన్ లైన్ లో సెప్టెంబరు 30లోగా సబ్మిట్ చేయాలి. ఇక దరఖాస్తుల హార్డ్ కాపీలను అక్టోబరు 6లోగా యూనివర్సిటీ సూచించిన అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులకు పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. ఒక్కో పోస్టుకు ఒక్కో విధమైన అర్హతలు అవసరం. పోస్టులవారీగా అభ్యర్థుల వయసు 32 – 56 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్ సైట్ ను విజిట్ చేయండి.
95 పోస్టుల వివరాలు ఇవీ..
- డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్)- 1
- అసిస్టెంట్ లైబ్రేరియన్- 4
- అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2
- సెక్షన్ ఆఫీసర్- 2
- అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02
- సెక్యూరిటీ ఆఫీసర్- 2
- సీనియర్ అసిస్టెంట్- 2
- ప్రొఫెషనల్ అసిస్టెంట్- 1
- జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8
- అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1
- జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2
- స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1
- ఆఫీస్ అసిస్టెంట్- 10
- లైబ్రరీ అసిస్టెంట్- 4
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44
- హిందీ టైపిస్ట్- 1
- ల్యాబొరేటరీ అటెండెంట్- 8