Ganesh Navaratri 2023 : అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు..హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
గణేష్ నవరాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందించబోతున్నట్లు తెలిపింది
- Author : Sudheer
Date : 14-09-2023 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
దేశం మొత్తం గణేష్ నవరాత్రులు (Ganesh Navaratri) సిద్ధమైంది. ఊరు..వాడ,.పల్లె ..పట్టణం అనే తేడాలేకుండా ప్రతి చోట గణనాధుడి నవరాత్రుల వేడుకలు మొదలుకాబోతున్నాయి. ఇక హైదరాబాద్ లో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఎలా జరుగుతాయో చెప్పాల్సిన పనిలేదు. ఈ నవరాత్రులను చూసేందుకు ఇతర చోట్ల నుండి కూడా వస్తారు. ముఖ్యంగా ఖైరతాబాద్ (khairatabad Ganesh 2023) నవరాత్రులు చాల ప్రత్యేకం. ఇక్కడ గణేషుడి భారీ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలపై కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు భక్తులు. పండుగ మొదటి రోజు నుంచే వేల మంది భక్తులు ఖైరతాబాద్ వస్తుంటారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా అదనపు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
Read Also : TSRTC Merger Bill : ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం..సంతోషంలో ఉద్యోగులు
ఈ తరుణంలో హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) కీలక నిర్ణయం తీసుకుంది. గణేష్ నవరాత్రుల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు (Metro Timings ) అందించబోతున్నట్లు తెలిపింది. భక్తుల ప్రయాణం సులువుగా… సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు చేపడతామని మెట్రో తెలిపింది. భక్తుల ప్రయాణానికి, భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని, గణేష్ నవరాత్రుల్లో అవాంతరాలు లేని ప్రయాణాన్ని కల్పించేలా మెట్రో రైలు సేవలు పెంచుతామని ప్రకటించింది. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే ఖైరతాబాద్ స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్ల ఏర్పటు, భక్తులు టికెట్లు కొనేందుకు ఆలస్యం కాకుండా చర్యలు , వీలైనంత త్వరగా టిక్కెట్లు తీసుకుని రైళ్లలో ఎక్కే అవకాశం వంటి సదుపాయాలను కల్పిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.