HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >How Is The Golden Axe Used To Make The Chariot Of Lord Jagannath

Chariot – Golden Axe : జగన్నాథుని రథం తయారీకి బంగారు గొడ్డలి.. నేటి నుంచే రథయాత్ర

Chariot - Golden Axe : పూరీ జగన్నాథుని రథయాత్ర నేటి నుంచి పూరీలో ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో జగన్నాథుని ప్రపంచంలోనే అతి పెద్ద వంటగది గురించి తెలుసుకుందాం.. 884 ప్రత్యేక చెట్ల కలపతో జగన్నాథుని రథం తయారీ, ఆ కలప కోతకు బంగారు గొడ్డలి ఉపయోగం వంటి విశేషాలపై లుక్ వేద్దాం.. 

  • By Pasha Published Date - 08:17 AM, Tue - 20 June 23
  • daily-hunt
Chariot Golden Axe
Chariot Golden Axe

Chariot – Golden Axe : పూరీ జగన్నాథుని రథయాత్ర నేటి నుంచి పూరీలో ప్రారంభం కానుంది.

ఈనేపథ్యంలో జగన్నాథుని ప్రపంచంలోనే అతి పెద్ద వంటగది గురించి తెలుసుకుందాం.. 

884 ప్రత్యేక చెట్ల కలపతో జగన్నాథుని రథం తయారీ, ఆ కలప కోతకు బంగారు గొడ్డలి ఉపయోగం వంటి విశేషాలపై లుక్ వేద్దాం..    

జగన్నాథుని రథయాత్ర నేటి నుంచి పూరీలో ప్రారంభం కానుంది. రాత్రి 10:04 గంటలకు జగన్నాథుడు సోదరి సుభద్ర, సోదరుడు బలరాంతో కలిసి పూరీ నగర పర్యటనకు బయలుదేరుతారు. మరుసటి రోజు రాత్రి 7.09 గంటలకు గుండిచా గుడికి వెళ్లి అక్కడ 9 రోజులు ఉంటారు. ఆ తర్వాత తిరిగి జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు. ఈ ప్రయాణం కోసం మూడు పెద్ద రథాలు తయారు చేయబడ్డాయి. మొదటి రథంలో జగన్నాథుడు, రెండో రథంలో బలరాముడు, మూడో రథంలో సుభద్ర విహరిస్తారు. రథాన్ని తయారు చేసేందుకు 884 ప్రత్యేక చెట్ల కలపను ఉపయోగిస్తారు. పూజారులు అడవికి వెళ్లి.. రథం తయారీకి ఉపయోగించే కలపను సేకరించే చెట్లకు పూజలు చేస్తారు. పూజ అనంతరం బంగారు గొడ్డలితో(Chariot – Golden Axe) చెట్లను నరికేస్తారు. స్వామివారి రథాల తయారీదారులు రోజుకు ఒకసారి మాత్రమే సాధారణ ఆహారాన్ని తింటారు.

Puri Idols Mystery

ఆలయ పూజారి ఏమన్నారంటే..

ఆలయ పూజారి సూర్యనారాయణ రథ్ శర్మ మాట్లాడుతూ.. ‘ఉదయం లేచిన తర్వాత జగన్నాథుడు పళ్ళు తోముకుంటాడు. వారికి చెక్క, కర్పూరం ఇస్తాం. అప్పుడు వారు చిత్ర స్నానం చేస్తారు. అంటే ఏడు చేతుల దూరం నుంచి తన చిత్రాన్ని అద్దంలో చూసుకుంటారు. ఆ అద్దం సూర్యుని ప్రతీక” అని చెప్పారు.

Also read : Puri Idols Mystery : విశ్వకర్మ చెక్కి..బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన విగ్రహాలు

ప్రసాదం తయారీ ప్రక్రియ 

జగన్నాథుని వంటగది ప్రపంచంలోనే అతి పెద్ద వంటగదిగా పరిగణించబడుతుంది. దాదాపు 1500 మంది కలిసి ఇక్కడ ప్రసాదం సిద్ధం చేస్తారు. ఆనంద్ బజార్ గర్భగుడి కుడి వైపున ఉంది. పప్పు, బియ్యం మట్టి కుండల్లో ఉంచుతారు. పప్పు, అన్నం ఇక్కడ ప్రసాదం.  ఒక వ్యక్తి తినాలనుకుంటే.. అతనికి 100 రూపాయలకు  ప్రసాదం లభిస్తుంది. ఇందులో పప్పు, బియ్యం, కూరగాయలు, ఖీర్ ఉంటాయి. హండీ నిండుగా ఆహారం తీసుకోవాలంటే అందుకు 300 రూపాయలు చెల్లించాలి. ఇక్కడ 56 రకాల ప్రసాదాలు తయారు చేస్తారు. ఇందులో కొబ్బరి లడ్డూలు, మావా లడ్డూలు, పెరుగు అన్నం, వివిధ రకాల పెటా, మాల్పువా, దాల్-రైస్, అనేక రకాల కూరగాయలు, ఖీర్, కిచ్డీ వంటివి ఉంటాయి.  ఈ నైవేద్యాలు ఏకకాలంలో 742 స్టవ్‌లపై తయారు చేస్తారు. దీని కోసం, ఎనిమిది కుండలను ఒకదానిపై ఒకటిగా పేరుస్తారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది హండీల నుండి ఆహారం తీసుకోబడుతుంది. మొత్తం 742 చుల్హాలకు ఇదే ప్రక్రియ అనుసరించబడుతుంది.

Puri Jagannath

12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహం మార్పు..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఒక సంవత్సరంలో రెండు ఆషాఢాలు వచ్చినప్పుడు ఇక్క దేవతా విగ్రహం మార్చబడుతుంది. ఇది 12-15 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో నగరం మొత్తం కరెంటు సప్లై ఆపేస్తారు. గుడి లోపలికి ఎవరూ రాకుండా గట్టి కాపలా ఉంటుంది. విగ్రహాన్ని మార్చే బాధ్యత కలిగిన పూజారి కళ్లకు గంతలు కడతారు. తద్వారా వారు విగ్రహం పైన ఉన్న బ్రహ్మ పదార్థాన్ని చూడలేరు. ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఎవరికీ తెలియదు. దాని పైన కొత్త విగ్రహాన్ని ఉంచుతారు.ఈ  ఆలయానికి కొద్ది దూరంలోనే పూరీ రాజకుటుంబం ఉంది. ప్రతి సంవత్సరం ఈ ప్యాలెస్ ముందు రథయాత్ర కోసం రథాన్ని సిద్ధం చేస్తారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 742 stoves
  • Chariot - Golden Axe
  • Chariot of Lord Jagannath
  • Golden AxE
  • Jagannath Temple
  • Puri jagannath Rath Yatra

Related News

    Latest News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd