chicken soup:జలుబు చేసిందా..?చికెన్ సూప్ తాగండి.!!
- By hashtagu Published Date - 01:30 PM, Sun - 5 June 22
మనకు బాగా జలుబు చేసినప్పుడు ఏం చేస్తాం. కషాయం తాగడమో…ఆవిరి పట్టడమో చేస్తుంటాం. కొంతమంది చికెన్ సూప్ తాగడం లేదా…సూప్ లా వండిన చికెన్ గ్రేవీతో తింటుంటారు. ఇది సంప్రదాయ చికిత్స అనుకుంటారు కానీ..నిజానికి చికెన్ సూప్ ఉపశమనానికి బాగా పనిచేస్తుంది. దీనికి శాస్త్రీయా కారణాలు కూడా ఉన్నాయి. సూప్ లా వండిన చికెన్ లో సిప్టిన్ లేదా సిస్టయిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుందట. ఇది మాత్రమే కాదు…ఇలా వండే సమయంల ఆ సూప్ లోని ఖనిజ లవణాలూ, విటమిన్లతోపాటు పోషకాలన్నీ కూడా ద్రవంలా ఉడికే సూప్ లోకి స్రవిస్తాయి.
అంతేకాదు గ్లైసిన్, ప్రోలైన్ వంటి అనేక అమైనో యాసిడ్స్ సముదాయమైన జిలాటిన్ కూడా ఈ సూప్ లోకి స్రవిస్తుంది. ఈ అమైనో యాసిడ్స్ ఇతర పోషకాలు కలగల్సిన సూప్ మన వ్యాధి నిరోధకశక్తిని మరింత పెంచుతుంది. ఈ అంశాలన్నీ జలుబు ఇతర ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తాయి. ఈ చికెన్ సూప్ దాదాపు ద్రవరూపంలో ఉంటుంది. దీంతో తొందరగా జీర్ణం కావడంతోపాటు అన్ని పోషకాలను వేగంగా శరీరానికి అందిస్తుంది. జీర్ణశక్తి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ఎముకలను మరింత పటిష్టం చేసేందుకు చికెన్ సూప్ దోహదపడుతుంది.