Hijab: బెజవాడకు పాకిన హిజబ్ వివాదం
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది.
- Author : Hashtag U
Date : 17-02-2022 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థనులను కాలేజీ యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. అయితే తాము ఫస్ట్ ఇయర్ నుంచి హిజాబ్ ధరించి వస్తున్నామని..కాలేజీ ఐడీ కార్డులో కూడా హిజాబ్ ధరించే ఫోటో దిగామని విద్యార్థినులు చెప్తున్నారు. ఈ వివాదంతో కాలేజీ దగ్గరకు పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు చేరుకుంటున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.