TDP Protest : పామర్రులో ఉద్రిక్తత.. పోలీసులకు చెమటలు పట్టిస్తోన్న టీడీపీ నేతలు
కృష్ణాజిల్లా పామర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని...
- Author : Prasad
Date : 11-09-2022 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణాజిల్లా పామర్రులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ సీనియర్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పామర్రు ప్రధాన రహదారిపై టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, బచ్చుల అర్జునుడులను పోలీసులు ఆపేశారు. అక్కడి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు, టీడీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. అయితే కార్ డోర్ లాక్ చేసుకుని టీడీపీ నేతలు లోపలే కూర్చొన్నారు. కారు లోపలున్న టీడీపీ నేతలను ఎలా బయటకు తేవాలో తెలియక పోలీసుల సతమతమవుతున్నారు. కారు చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.