Raghavendra Rao: డైరెక్టర్ రాఘవేందర్ రావుకు షాకిచ్చిన హైకోర్టు!
కె.రాఘవేంద్రరావు, కె.కృష్ణమోహన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
- By Balu J Published Date - 11:54 AM, Fri - 10 November 23

Raghavendra Rao: బంజారాహిల్స్ షేక్‌పేటలో రెండెకరాల భూకేటాయింపుపై సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, కె.కృష్ణమోహన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్‌లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాయితీ ధరతో భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
Also Read: Revanth Reddy: పదేళ్లుగా గుర్తురాని కొనాపూర్ ఇవాళ గుర్తొచ్చిందా? కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్!