Covid: హై అలర్ట్… కరోనా మళ్లీ అంటుంకుంటుందట!
దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని వల్ల ప్రపంచం అతలాకుతులం అయ్యింది. కానీ దీని తీవ్రత మాత్రం ఏదో ఒక దేశంలో ఉంటూనే ఉంది.
- By Nakshatra Published Date - 10:00 PM, Sat - 4 March 23

Covid: దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని వల్ల ప్రపంచం అతలాకుతులం అయ్యింది. కానీ దీని తీవ్రత మాత్రం ఏదో ఒక దేశంలో ఉంటూనే ఉంది. ఇప్పుడు భారత్ లో మారోసారి కరోనా అలర్ట్ వచ్చినట్లు కనిపిస్తుంది. గడిచిన ఇరభై నాలుగు గంటల్లో 300 పైగా కేసులు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ తగ్గిందని భావిస్తున్న సమయలో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్ లో 344 కరోనా కేసుల సంఖ్య నమోదయింది. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల ఇప్పటి వరకూ 4,46,86,361కు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా. ఈరోజు వరకూ దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 2,229 ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు 98.06 శాతంగా నమోదయింది. అయితే ఆరుగురు మరణించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా చికిత్స పొంది 258 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,770కి చేరుకుంది.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువైనట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేసింది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వద్ద పెద్దగా ప్రమాదం లేకున్నా, ఇది కరోనాకు దారి తీస్తుందా అని ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే డాక్టర్ల సలహాలతో మందులు వాడాలనీ ఐసీఎంఆర్ సూచించింది.

Related News

Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
దేశంలో కరోనా (COVID-19) మరోసారి విజృంభిస్తోంది. తాజాగా ఓ పరిశోధనలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి, గర్భధారణ సమయంలో SARS-CoV-2 ఇన్ఫెక్షన్ ఉన్న తల్లులకు జన్మించిన పిల్లలు డెలివరీ తర్వాత మొదటి 12 నెలల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్‌లతో బాధపడుతున్నారు.