Helicopter With 6 Missing : హెలికాప్టర్ మిస్సింగ్.. ఆరుగురితో బయలుదేరిన 9 నిమిషాలకే గల్లంతు
Helicopter With 6 Missing : ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ మిస్సయ్యింది.
- By Pasha Published Date - 01:42 PM, Tue - 11 July 23
Helicopter With 6 Missing : ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ మిస్సయ్యింది. దాని ఆచూకీ దొరకడం లేదు. ఐదుగురు మెక్సికన్ టూరిస్టులు, నేపాలీ పైలట్ చెట్ బి గురుంగ్ తో కూడిన ఆ హెలికాప్టర్ నేపాల్లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో అదృశ్యమైంది. హెలికాఫ్టర్ రవాణా సేవల కంపెనీ మనంగ్ ఎయిర్ కు చెందిన 9N-AMV మోడల్ హెలికాఫ్టర్ నేపాల్ లోని సోలుఖుంబు జిల్లాలో ఉన్న సుర్కే విమానాశ్రయం నుంచి ఆ దేశ రాజధాని ఖాట్మండుకు మంగళవారం ఉదయం 10:04 గంటలకు బయలుదేరింది. అయితే బయలుదేరిన 9 నిమిషాలకే (ఉదయం 10:13 గంటలకు) 12,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) మేనేజర్ జ్ఞానేంద్ర భుల్ వెల్లడించారు. మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ తో తమకు కాంటాక్ట్ తెగిపోయిందని(Helicopter With 6 Missing) స్పష్టం చేశారు.
లాంజురా పాస్ వద్దకు హెలికాప్టర్ చేరుకోగానే.. చివరిగా ‘హలో’ సందేశం మాత్రమే కాంటాక్ట్ సెంటర్ కు వచ్చిందన్నారు. మనంగ్ ఎయిర్ ఖాట్మండు కేంద్రంగా పనిచేసే హెలికాప్టర్ సేవల సంస్థ. ఇది 1997లో ఏర్పాటైంది. ఈ సంస్థ చార్టర్డ్ హెలికాఫ్టర్ సేవలను అందిస్తోంది. అడ్వెంచర్ ఫ్లైట్లు హెలికాప్టర్ విహారయాత్రలు లేదా సాహసయాత్ర వంటి వ్యక్తిగతీకరించిన సేవలపై మనంగ్ ఎయిర్ దృష్టి సారించింది.
Tags
Related News
Everest Man : ‘ఎవరెస్ట్ మ్యాన్’.. 29వసారీ ఎవరెస్టును ఎక్కేశాడు
Everest Man : అత్యంత ఎత్తయిన పర్వతం ఎవరెస్టు. దీన్ని అధిరోహించడం అంటే ఆషామాషీ విషయమేం కాదు.