Viral video :వావ్…సీతాకోకచిలుకతో…పెంగ్విన్ ల ఆటలు..!!
సీతాకోకచిలుకలతో పెంగ్విన్లు ఆటలాడుతుంటే ఎలా ఉంటుంది. వావ్ అనిపించేలా ఉంటుంది కదూ. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
- By hashtagu Published Date - 11:33 AM, Mon - 6 June 22

సీతాకోకచిలుకలతో పెంగ్విన్లు ఆటలాడుతుంటే ఎలా ఉంటుంది. వావ్ అనిపించేలా ఉంటుంది కదూ. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఓ పెంగ్విన్ల గుంపు నెమ్మదిగా గెంతుతూ…సీతాకోకచిలుక వెంటపడటం ఎంతో చూడముచ్చగా ఉంది. ఈ ద్రుశ్యాన్ని ఓ వ్యక్తి తన కెమెరాలో క్లిక్ మనిపించాడు. పదికిపైగా ఉన్న ఓ పెంగ్విన్ల గ్రూప్…ఓ సీతాకోకచిలుక వెంటపడటం…ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఆ వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటికే 3.3మిలియన్ల మంది వీక్షించారు. 152,8వేల మంది లైక్ కొట్టారు. ఇక ఆ సీతాకోకచిలుక తన ఎగిరే విధానాన్ని పెంగ్విన్లు ఎగతాళి చేస్తున్నాయంటూ ఓ నెటిజన్ సరదాగా ట్వీట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
https://twitter.com/buitengebieden/status/1533022340887486466?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1533022340887486466%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Foffbeat%2Fviral-video-heartwarming-video-of-penguins-chasing-a-butterfly-delights-internet-3039815