Expensive Lawyer – Third Marriage : ఇండియాలోనే కాస్ట్లీ లాయర్ మూడో పెళ్లి.. ఎవరు ? ఏమిటి ?
Expensive Lawyer - Third Marriage : హరీశ్ సాల్వే.. ఈయన మన దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరు.
- By Pasha Published Date - 01:51 PM, Mon - 4 September 23

Expensive Lawyer – Third Marriage : హరీశ్ సాల్వే.. ఈయన మన దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరు. ఇటీవల ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైలెవల్ కమిటీలో సభ్యుడిగానూ నియమితులయ్యారు. ప్రస్తు తం 68 ఏళ్ల వయసున్న హరీశ్ సాల్వే బ్రిటన్ రాజధాని లండన్ లో ఎంతో వేడుకగా మూడో పెళ్లి చేసుకున్నారు. గ్రాండ్ గా జరిగిన ఈ పెళ్లి కార్యక్రమానికి నీతా అంబానీ, లలిత్ మోడీ, ఉజ్వల రౌత్ తదితరులు హాజరయ్యారు.
Also read : Vikram Landing Again : చంద్రుడిపై రెండోసారి విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్.. మళ్లీ ఎందుకంటే ?
Former Solicitor general of India, #HarishSalve got married for the 3rd time. Nita Ambani, Lalit Modi amongst others attended the ceremony.
Hopefully he is lucky the third time. pic.twitter.com/RVSPXyTujC
— Kumar Mihir Mishra (@Mihirlawyer) September 4, 2023
హరీశ్ సాల్వే మూడో భార్య ట్రినా (Trina) ఎవరు?
హరీశ్ సాల్వే మూడో భార్య పేరు ట్రినా. ఆమె బ్రిటన్ పౌరురాలు. హరీశ్ సాల్వే బ్రిటన్ లోని వేల్స్ , ఇంగ్లాండ్ కోర్టులకు క్వీన్స్ కౌన్సెల్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలోనే వారిద్దరికి పరిచయం ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక హరీశ్ సాల్వే మొదటి భార్య పేరు మీనాక్షి. 2020 జూన్ లో సాల్వే, మీనాక్షి విడాకులు తీసుకున్నారు. దీంతో వారి 30 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక జీవితం ముగిసింది. మీనా, హరీశ్ సాల్వే దంపతులకు సాక్షి, సానియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరీశ్ సాల్వే 65 ఏళ్ల వయసులో..2020 సంవత్సరంలో కరోలిన్ బ్రాస్సార్డ్ అనే 56 ఏళ్ల లండన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. కరోలిన్ బ్రాస్సార్డ్ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆమెకు మొదటి భర్త ద్వారా 18 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. కారణాలేమిటో తెలియదు కానీ.. కరోలిన్ బ్రాస్సార్డ్, హరీశ్ సాల్వే కూడా విడాకులు తీసుకున్నారు.
Also read :Muttiah Muralitharan: సచిన్ చేతుల మీదుగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ ట్రైలర్
న్యాయవాదిగా ఘన చరిత్ర
హరీశ్ సాల్వే భారతదేశ మాజీ సొలిసిటర్ జనరల్ గా సేవలందించారు. సాల్వే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ఆయనకు టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC గ్రూప్ వంటి ప్రముఖ క్లయింట్లు ఉన్నాయి. 2015లో సాల్వేకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. సాల్వే నాగ్‌పూర్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1992లో భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా నియమించబడటానికి ముందు ఆయన ఢిల్లీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు.