HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Harassment With Personal Sex Photos Rs 9986 Crore Compensation For The Victim

America: సెక్స్ ఫోటోలతో వేధింపులు.. బాధితురానికి వేల కోట్ల పరిహారం?

తాజాగా అమెరికాలో ఒక వ్యక్తి మహిళ పర్సనల్ సెక్స్ ఫోటోలతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు అతనికి ది

  • Author : Anshu Date : 18-08-2023 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

తాజాగా అమెరికాలో ఒక వ్యక్తి మహిళ పర్సనల్ సెక్స్ ఫోటోలతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించగా కోర్టు అతనికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తూ వేల కోట్ల పరిహారం చెల్లించాలి అంటూ తీర్పును ఇచ్చింది. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన ఒక మహిళ మార్క్వెస్‌ జమాల్‌ జాక్సన్‌ అనే వ్యక్తితో 2016 నుంచి కలిసి జీవించింది. వారు కలిసి షికాగోలో కొంతకాలం గడిపిన తర్వాత 2021 అక్టోబరులో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడిపోయారు. వారు విడిపోయిన తరువాత నుంచి ఆమెను అతడు వేధింపులకు గురి చెయ్యడం పెట్టాడు.

ఈ క్రమంలోనే గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను శృంగార వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేశాడు. వాటితో పాటు ఆమె ఇంట్లోని సీసీ కెమెరాలు, మొబైల్‌, ఈ-మెయిల్‌ నుంచి సేకరించిన వ్యక్తిగత ఫొటోలను ఆమె అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతాల ద్వారా పోస్టు చేశాడు. అలా పోస్టు చేసిన ఫొటోల లింకులను బాధితురాలి స్నేహితులు, కుటుంబ సభ్యులకూ పంపాడు. వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయడానికి ప్రయత్నించినా.. అందుకు నీ జీవితం సరిపోదు అంటూ ఆమెకు మొబైల్‌లో సందేశాలు పంపించేవాడు. దాంతో అతడి వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే పోలీసులు కూడా ఆమెకు న్యాయం చేయకపోవడంతో ఆమె గత ఏడాది అనగా 2022 ఏప్రిల్‌లో టెక్సాస్‌లోని హ్యారీస్‌ కౌంటీ సివిల్‌ కోర్టులో దావా వేశారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం ఒక వ్యక్తి అంగీకారం లేకుండా వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను మాజీ భాగస్వామి ఇంటర్నెట్‌లో షేర్‌ చేయడం నేరం అంతే కాకుండా వ్యక్తిత్వానికి హాని కలిగించే ఉద్దేశంతో చేసే ఇటువంటి చర్యలను రివెంజ్‌ పోర్న్‌ గా వ్యవహరిస్తారు. కేసు విచారణ సందర్బంగా ఇరుపక్షాల వాదనలు విన్న జ్యూరీ మహిళను మానసికంగా వేధించినందుకు 200 మిలియన్‌ డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,664 కోట్లు చెల్లించడం మాత్రమే కాకుండా ఆమెకు నష్టాన్ని కలిగించినందుకు శిక్షగా మరో బిలియన్‌ డాలర్లు అనగా రూ.8,322 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పు నిచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Harassment

Related News

LPL Financial opens first GCC outside US in Hyderabad

హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

LPL Financial  అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్చ్యూన్ 500 సంస్థ ‘ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్’ తన మొట్టమొదటి అంతర్జాతీయ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా రానున్న రోజుల్లో 1500 మంది టెకీలను నియమించుకోనుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 450కి పైగా జ

  • Tcs Nashik Campus Case

    TCS Nashik Campus Case : టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కేసు..సంచలన విషయాలు వెలుగులోకి !!

  • Tcs Nashik Case

    TCS క్యాంపస్‌లో.. కేరళ స్టోరీ కీ మించి దారుణాలు

Latest News

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd