Modi In Nepal: మోడీ.. శరణం.. గచ్ఛామి!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటిస్తున్నారు.
- Author : Balu J
Date : 16-05-2022 - 3:50 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేపాల్ వెళ్లిన పధాని నరేంద్రమోదీ బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని.. గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబినీ స్థలాన్ని సందర్శించారు. బుద్ధుని ఆనవాలు ఉన్న ప్రాంతంలో కొద్ది సేపు కూర్చుని ప్రార్ధనలు చేశారు. అదేవిధంగా పవిత్ర మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
లుంబినీ ప్రాంతంలో జన్మించిన బుద్ధుని అసలు పేరు సిద్ధార్ధుడు. ఆత్మ జ్ఞానం కోసం ఆయన తర్వాత కాలంలో భారతదేశంలో బీహార్‌లో ఉన్న బుద్ధగయకు చేరుకుని.. ఇక్కడే సుదీర్ఘ కాలం తపస్సు చేశారు. అనంతరం.. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీ నగర్‌లో దేహత్యాగం చేశారు. గౌతమ బుద్ధుని బోధనలు, బౌద్ధమతం పలు దేశాలు ఆచరిస్తున్నాయి.
Addressing a programme in Lumbini on the auspicious occasion of Buddha Purnima. https://t.co/Frs6jrcHIC
— Narendra Modi (@narendramodi) May 16, 2022