Guvvala Balaraju: గువ్వల బాలరాజుపై చిన్నారుల అభిమానం, నామినేషన్ కోసం పాకెట్ మనీ అందజేత
అచ్చంపేటలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు సైతం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అభిమానాన్ని చురగొంటున్నారు.
- By Balu J Published Date - 04:44 PM, Sat - 28 October 23
Guvvala Balaraju: అచ్చంపేటలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు సైతం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అభిమానాన్ని చురగొంటున్నారు. అచ్చంపేటకు చెందిన అన్నదమ్ములు ఇద్దరు చిన్నారులు సోమేష్ చౌహన్ 5వ తరగతి, వరుణ్ చౌహన్ 3వ తరగతి చదువుతున్నారు. మీరు ఇద్దరు ప్యాకెట్ మనీ కోసం దాచుకున్న డబ్బులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అందజేశారు.
శనివారం అచ్చంపేటలో ఎమ్మెల్యే నివాస గృహంలో కలసి దాచుకున్న డబ్బులను రూ:3,220/-చిన్నారులు అందజేశారు. అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడవసారి నామినేషన్ వేయనున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు డిపాజిట్ కోసం చిన్నారులు తమకోసం దాచుకున్న ప్యాకెట్ మనీ అందించి చిన్నారులకు సైతం గువ్వల బాలరాజు పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
Also Read: Chiranjeevi Konidela: ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది