Guntur Kaaram: శరవేగంగా గుంటూరు కారం షూటింగ్
- Author : Balu J
Date : 29-09-2023 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
Guntur Kaaram: చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జతకట్టిన మహేష్ బాబు మోస్ట్ ఎవైటెడ్ సినిమాలలో గుంటూరు కారం ఒకటి. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను అందిస్తోంది. వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది. మహేష్ బాబుతో పాటు ప్రకాష్ రాజ్, మరికొందరు క్యారెక్టర్ యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. మరో నాలుగు రోజుల పాటు షూటింగ్ జరగనుందని సమాచారం.
రాజమౌళి తదుపరి చిత్రాన్ని ప్రారంభించేలోపు మహేష్‌కు మరో సినిమా చేయడానికి తగినంత సమయం ఉండేలా త్రివిక్రమ్ షూటింగ్‌ను వేగవంతం చేశారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కూడా నటించింది. రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.