GrandPa Love: మనవడిని చూసి తాత ఉద్వేగం.. ఎమోషన్ ను టచ్ చేసే వీడియో !!
'ఈ భూమిపై రక్త సంబంధాన్ని మించింది మరొకటి లేదు' అంటారు.
- Author : Hashtag U
Date : 18-04-2022 - 4:23 IST
Published By : Hashtagu Telugu Desk
‘ఈ భూమిపై రక్త సంబంధాన్ని మించింది మరొకటి లేదు’ అంటారు. రక్త సంబంధం విలువను చాటిచెప్పే ఎన్నో వీడియోలను మీరు చూసి ఉంటారు. పుట్టిన తర్వాత తొలిసారిగా.. ఆస్పత్రి నుంచి ఇంటికి ఉయ్యాలలో వచ్చిన తన మనవడిని కళ్లారా చూసుకొని.. ఓ తాత భావోద్వేగానికి గురయ్యాడు. భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనవడిని కౌగిలించుకొని ఆనంద పరవశంలో మునిగిపోయాడు. ఆ పక్కనే నిలబడ్డ నానమ్మ .. ఈ దృశ్యాన్ని చూసుకొని ఆనందభాశ్పాలు రాల్చింది.
ఈ దృశ్యలతో కూడిన వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ‘ గుడ్ న్యూస్ కరెస్పాండెంట్’ అనే ఇన్స్టా పేజీలో ఈ ఉద్వేగ భరిత వీడియోను పోస్ట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం దాన్ని మీరు కూడా చూడండి..