Gopalapuram TDP Incharge : గోపాలపురం టీడీపీ ఇంఛార్జ్‌గా మద్దిపాటి వెంకటరాజు
మరో రెండెళ్లు ఎన్నికలకు గడువు ఉండగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది
- By Prasad Published Date - 09:17 AM, Sat - 15 October 22

మరో రెండెళ్లు ఎన్నికలకు గడువు ఉండగానే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సమీక్షలు చేస్తున్నారు. నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన ఆరా తీస్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మారుస్తూ కొత్త వారిని అధిష్టానం నియమిస్తుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇంఛార్జ్‌ని మార్చారు. టీడీపీ ప్రోగ్రాం కమిటీ ఇంఛార్జ్‌గా ఉన్న మద్దిపాటి వెంకటరాజుని గోపాలపురం నియోజకవర్గం ఇంఛార్జ్‌గా అధిష్టానం నియమించింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యువనేత పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించారు.