HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Google Pays 82000 Crores A Year To Maintain Monopoly Over Online Search

Google Pays 82000 Crores : గూగుల్ ఆ కంపెనీలకు ఏటా 82వేల కోట్లు ఇస్తోంది.. అమెరికా సర్కారు సంచలన ఆరోపణలు

Google Pays 82000 Crores :  ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పై అమెరికా ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.

  • Author : Pasha Date : 13-09-2023 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google Pays 82000 Crores
Google Pays 82000 Crores

Google Pays 82000 Crores :  ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పై అమెరికా ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. ఆన్‌లైన్ సెర్చ్‌పై తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి యాపిల్,  ఇతర స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలకు గూగుల్ ప్రతి సంవత్సరం దాదాపు రూ.82వేల కోట్ల దాకా చెల్లింపులు చేస్తోందని పేర్కొంది. అమెరికా యాంటీ ట్రస్ట్ కు సంబంధించిన కేసులో మంగళవారం వాషింగ్టన్ కోర్టులో జరిగిన తొలి రోజు విచారణ సందర్భంగా  అమెరికా న్యాయశాఖ తరఫు న్యాయవాది కెన్నెత్ డింట్జెర్ ఈ ఆరోపణ చేశారు. ఫోన్‌లు, వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ సెర్చ్ ఇంజన్ ను డీఫాల్ట్ గా ఉంచడానికి గూగుల్ ప్రతి సంవత్సరం యాపిల్, ఇతర స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు రూ.82వేల కోట్ల దాకా పేమెంట్స్ చేస్తోందన్నారు. తద్వారా సెర్చ్ ఇంజన్ మార్కెట్లో ఇతరులు ఎదిగే అవకాశం లేకుండా అవాంతరం క్రియేట్ చేస్తోందన్నారు. ‘‘ఈ కేసు ఇంటర్నెట్ భవిష్యత్తుకు సంబంధించింది. సెర్చ్ ఇంజన్ లో Google ఎప్పుడైనా అర్ధవంతమైన పోటీని ఎదుర్కొంటుందా?’’ అని కెన్నెత్ డింట్జెర్  ప్రశ్నించారు. జడ్జి అమిత్ పి.మెహతా ఎదుట ఈ వాదనలు జరిగాయి.

Also read : Famous Ganesh Temples : దేశంలోని ఆరు ప్రముఖ వినాయక ఆలయాలివే..

గూగుల్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే.. 

గూగుల్ తరఫు న్యాయవాది జాన్ ష్మిడ్‌లిన్ ప్రతివాదనలు వినిపిస్తూ.. తమపై చేసిన ఆరోపణలను ఖండించారు.  ‘‘గత కొన్ని దశాబ్దాలుగా గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌ను డెవలప్ చేస్తూ వస్తోంది. తమపై ఆరోపణలు చేస్తున్న వారు ఈవిషయాన్ని మర్చిపోతున్నారు’’ అని  జాన్ ష్మిడ్‌లిన్ కోర్టుకు తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టడం, సెర్చ్ ఇంజన్ సేవల్లో నాణ్యతను పెంచడం వల్లే తమపై నెటిజన్లకు విశ్వసనీయత పెరిగిందని స్పష్టంచేశారు. ఐఫోన్ సహా అన్ని స్మార్ట్ ఫోన్లలోని బ్రౌజర్లలో గూగుల్ కు స్థానం దక్కడానికి కారణం.. దానికి ప్రజల్లో ఉన్న క్రేజ్, విశ్వసనీయత మాత్రమేనని గూగుల్ తరఫు న్యాయవాది తేల్చి చెప్పారు. కాగా, ఈ యాంటీ ట్రస్టు కేసులో ఇంటర్నెట్ ఏకఛత్రాధిపత్యం విషయంలో గూగుల్ పై ఆరోపణలు చేసిన బాధిత సెర్చ్ ఇంజన్ కంపెనీల జాబితాలో  మైక్రోసాఫ్ట్ యొక్క బింగ్, డక్‌డక్‌గో వంటివి (Google Pays 82000 Crores) ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 82000 Crores A Year
  • google
  • Google Pays 82000 Crores
  • Monopoly In Online Search
  • US government

Related News

Google India

భారత్‌లో గూగుల్ భారీ క్యాంపస్‌… 20,000 మందికి ఉద్యోగాలు

Google  భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే.

    Latest News

    • మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి

    • ‘మధిర అంటే నాకు ప్రాణం’ – భట్టి విక్రమార్క

    • క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? నిరుద్యోగులకు లాభం ఏంటి?

    • భారీగా తగ్గనున్న హార్లే డేవిడ్సన్ బైక్ ధరలు!

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    Trending News

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

      • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

      • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

      • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

      • భార‌త్ రూ. 725 కోట్ల రూపాయల భారీ డీల్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd