Pani Puri: గూగుల్ డూడుల్‌లో పానీ పూరి
వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వంటకం పానీ పూరి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా పానీ పూరిని ప్రతిఒక్కరూ ఇష్టపడతారు.
- Author : Praveen Aluthuru
Date : 12-07-2023 - 3:39 IST
Published By : Hashtagu Telugu Desk
Pani Puri: వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వంటకం పానీ పూరి. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా పానీ పూరిని ప్రతిఒక్కరూ ఇష్టపడతారు. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే మొదటగా గుర్తొచ్చేది పానీ పూరి. ప్రస్తుతం ఏ స్ట్రీట్ లో చూసినా బడ్జెట్ లో రుచిగల పానీపూరి లభిస్తుంది. సో ప్రపంచ వ్యాప్తంగా పానీ పూరికి లవర్స్ ఉన్నారు. అయితే ఈ రోజు పానీపూరీని గూగుల్ తన డూడుల్ లో చేర్చింది.
సెర్చ్ దిగ్గజం గూగుల్ పానీ పూరితో ఇంటరాక్ట్ అయింది. గూగుల్ పానీ పూరితో ఇంటరాక్ట్ అవ్వడం ఏంటని అనుకుంటున్నారా?. మరేంలేదు 2015లో ఇదే రోజున మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్ మాస్టర్‌చెఫ్ చేసిన పానీ పూరి ప్రపంచ రికార్డ్ సాధించింది. ఈ నేపథ్యంలో గూగుల్ తన డూడుల్ లో పానీపూరిని చేర్చింది. గూగుల్ డూడుల్ లో బంగాళదుంప, చిక్‌పీస్, మసాలా దినుసులు, పెరుగు, ఒక డూడుల్ లో నీళ్లు ఇలా పానీపూరీలో ఉండే అన్ని పదార్ధాలను తన డూడుల్ లో చేర్చింది.
Read More: Wife-Husband 7 Arrests : దడపుట్టించిన వైఫు.. భర్తకు 7 సార్లు జైలు..7 సార్లు బెయిలు!!