Gold Seized : హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు ప్రయాణికుల నుంచి సుమారు 1.93 కిలోల
- By Prasad Published Date - 07:34 AM, Tue - 11 July 23
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నలుగురు ప్రయాణికుల నుంచి సుమారు 1.93 కిలోల బంగారం, 62,400 సిగరెట్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో 1399 గ్రాముల స్మగ్లింగ్ బంగారాన్ని దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని సిబ్బంది సహాయంతో విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయాణికుడు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. మరో కేసులో 526 గ్రాముల స్మగ్లింగ్ బంగారం జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 62,400 స్మగ్లింగ్ సిగరెట్ లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Related News
Salman Khan : సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసు.. జైలులో నిందితుడి సూసైడ్
Salman Khan : బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం ఇటీవల కలకలం రేపింది.