Telangana Rains: భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వారం రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే.
- By Praveen Aluthuru Published Date - 11:33 AM, Wed - 26 July 23
Telangana Rains: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వారం రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఐఎండీ హెచ్చరికల మేరకు తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక తెలంగాణాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇదిలా ఉండగా తెలంగాణాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నెమ్మదిగా ఉదృత రూపం దాల్చుతుంది. మంగళవారం ఉదయం 36.5 అడుగులు ఉన్న గోదావరి, సాయంత్రానికి 38.8 అడుగులకు పెరిగింది. తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 13 గేట్లు ఎత్తి 15,741 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు సంబంధిత అధికారులు. కిన్నెరసాని 402.30 అడుగులకు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక కోరారు.
Also Read: Hebba Patel : అందాలతో సెగలు పుట్టిస్తున్న హెబ్బా పటేల్