Dhanbad: బొట్టు పెట్టుకుని స్కూల్ కి వచ్చిందని విద్యార్థిని చితకబాదిన టీచర్.. చివరికి?
మాములుగా స్కూల్ కి పిల్లలను బొట్టు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి క్లీన్ గా రమ్మని చెబుతూ ఉంటారు. పరిశుభ్రతనీ పాటించమని చెబుతూ ఉంటారు. కానీ
- By Anshu Published Date - 05:22 PM, Wed - 12 July 23

మాములుగా స్కూల్ కి పిల్లలను బొట్టు పెట్టుకొని అందంగా రెడీ అయ్యి క్లీన్ గా రమ్మని చెబుతూ ఉంటారు. పరిశుభ్రతనీ పాటించమని చెబుతూ ఉంటారు. కానీ ఝార్ఖండ్‌లో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఒక ఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే నుదుటిపై బొట్టు పెట్టుకొని వచ్చింది అని టీచర్ విద్యార్థిని కొట్టింది. అసలేం జరిగిందంటే.. ఝార్ఖండ్ లోని ధన్‌బాద్‌లోని ఒక పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. నుదుటిపై బొట్టు పెట్టుకుని వచ్చిందని బాలికను ఉపాధ్యాయుడు కొట్టాడు.
అయితే అది అవమానంగా భావించిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం ధన్‌బాద్‌లోని తెతుల్ మరిలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రులు, స్థానికులు మంగళవారం పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బాలిక మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై బాలల హక్కుల జాతీయ కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రియాంక్ కనుంగో స్పందిస్తూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని, మా టీమ్ ధన్‌బాద్‌కు వెళ్తుందని ట్వీట్ చేశారు. \
చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జీ మాట్లాడుతూ బాలిక ఆత్మహత్యకు కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇది తీవ్రమైన ఘటన, జరిగిన సంఘటన పై జిల్లా విద్యాశాధికారిని కలిసి ఆయన దృష్టికి తెచ్చాము. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించాను అని ఆయన తెలిపారు. ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడంతో నెటిజన్స్ మండి పడుతున్నారు.