Delhi Metro: ఢిల్లీ మెట్రోలో యువకుడిని చితక్కొట్టిన యువతి
ఢిల్లీ మెట్రో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- By Praveen Aluthuru Published Date - 06:25 PM, Tue - 12 September 23

Delhi Metro: ఢిల్లీ మెట్రో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులు, మెట్రోలో ముద్దులాట ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చేసుకుంది. దీంతో ఓ యువతీ యువకుడిని చితకబాదింది. మెట్రోలో పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో ఓ పోకిరీ అదే అదునుగా పక్కన ఉన్న యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. మీద చేతులేస్తూ ఏం తెలియనట్లు ప్రవర్తించాడు. సహనం కోల్పోయిన సదరు యువతీ పోకిరి తాట తీసింది. అందరూ చూస్తుండగానే చెంపలు వాయించింది. వైలెట్ లైన్ మెట్రోలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మెట్రోలో ఇలాంటి ఫైటింగ్ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. మెట్రోలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రయాణికులు మెట్రోలో మర్యాదగా ప్రవర్తించాలంటూ స్టేషన్లలో ప్రకటనలు చేయడం ప్రారంభించింది.అప్పటికీ ఇలాంటి ఘటనలు ఆగడం లేదు.