Ganesh Laddu గణేష్ లడ్డూ కొట్టేసిన స్కూల్ పిల్లలు.. వీడియో వైరల్..!
Ganesh Laddu దేశం మొత్తం గణేష్ నవరాత్రి ఉత్సవాలను గణంగా జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 18న వినాయక చవితి
- Author : Ramesh
Date : 24-09-2023 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
Ganesh Laddu దేశం మొత్తం గణేష్ నవరాత్రి ఉత్సవాలను గణంగా జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 18న వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి పూజలు మొదలు పెట్టగా 9 రోజులు ఉదయం సాయంత్రం రెండు పూటలా పూజలు నిర్వహిస్తారు. హైదరాబాద్ మహా నగరంలో కూడా వేల సంఖ్యలో గణేష్ మండపాలు పూజలు నిర్వహిస్తున్నారు. ఇక సిటీలో నిమజ్జనం రోజు ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇదిలాఉంటే గణేష్ లడ్డు మీద కన్నేసిన స్కూల్ గ్యాంగ్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఆ లడ్డూను కొట్టేశారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన బయట పడింది. శనివారం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న స్కూల్ పిల్లలు నలుగురు గణేష్ మండపం లోకి వెళ్లారు. అయితే ఆ మండపం లో ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్న లడ్డూని దొంగిలించారు. గణనాథుడి చేతిలో పెట్టిన 21 కిలోల లడ్డూ పిల్లలు ఎత్తుకెళ్లారు.
21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లి తినేసిన స్కూల్ విద్యార్థులు
చార్మినార్ పీఎస్ పరిధిలోని ఘాన్సీ బజార్ గణేష్ మండపంలో 21 కిలోల లడ్డూను ఎత్తుకెళ్లిన స్కూల్ విద్యార్థులు
స్కూల్ నుంచి వెళ్తూ ఒక్కసారిగా మండపంలోకి చొరబడి పెద్ద లడ్డూను తీసుకెళ్లి తినేసిన స్టూడెంట్స్ pic.twitter.com/0Q4jYIQ6Q1
— Telugu Scribe (@TeluguScribe) September 24, 2023
దొంగిలించిన లడ్డూ(Ganesh Laddu) ని వాళ్లంతా కూడా పంచుకుని తినేశారు. అయితే విషయం తెలుసుకున్న అక్కడ కమిటీ వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే స్కూల్ పిల్లలే చోరీకి పాల్పడినట్టు తేలింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలకు ఈ వయసులో నేర్పించాల్సిన విషయాలను నేర్పించకపోతే ఇలానే తయారవుతారంటూ విషయం తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు.
ముఖ్యంగా అందరికీ పంచి పెట్టాల్సిన ప్రసాద్ దొంగతనం చేయాలనే ఆలోచన వారికి రావడం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. అయితే పిల్లలు కేవలం లడ్డూ కోసమే మండపం లోకి వెళ్లారా హిండీ లాంటిది ఏమైనా ఉంటే దాన్ని కాజేద్దామని అనుకున్నారా ఏది దొరక్క లడ్డూని తీసుకొచ్చారా లాంటి విషయాలు విచారణలో తేలనున్నాయి. ఈ తరం విద్యార్ధుల వింత పోకడలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన గణేష్ లడ్డూ చోరీకి సంబందించిన న్యూస్ తెలుగు రెండు రాష్ట్రాల్లో వైరల్ అయ్యింది.
Also Read : Manchu Manoj Talk Show: మంచు మనోజ్ బాలయ్యకి పోటీ ఇస్తాడా.. ఫస్ట్ గెస్ట్ అతనేనా..!