HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Gaganyans Test Flight In A Few Minutes What And How About It

Gaganyaan Mission : ఇవాళ ‘గగన్‌యాన్’ టెస్ట్ ఫ్లైట్.. ఏమిటి ? ఎలా ?

Gaganyaan Mission : ఇంకొన్ని నిమిషాల్లో గగన్‌యాన్ మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్ జరగబోతోంది.

  • By Pasha Published Date - 08:37 AM, Sat - 21 October 23
  • daily-hunt
Gaganyaan Mission
Gaganyaan Mission

Gaganyaan Mission : ఇవాళ  గగన్‌యాన్ మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్ జరగబోతోంది. వాస్తవానికి ఇది 8 గంటలకే జరగాల్సి ఉంది. కానీ ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1)  రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో కౌంట్ డౌన్‌ టైంను పొడిగించారు. ఈ ప్రయోగంపై స్వయంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ శ్రీహరికోటలో శాస్త్రవేత్తలతో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది.అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు భారత్‌ చేపడుతున్న గగన్‌యాన్‌లో తొలి అడుగు ఇదే. ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) అనే ఈ పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ ఎంతమేరకు సమర్ధంగా ఉంది అనేది టెస్ట్ చేస్తున్నారు. గగన్‌యాన్‌లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేముందు ఇస్రో దాదాపు 20 విభిన్న పరీక్షలు నిర్వహించనుంది. వాటిలో మొదటిదే..‘‘ టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌(టీవీ-డీ1)’.  ఇందులో భాగంగా క్రూ మాడ్యూల్‌ను టీవీ-డీ1 రాకెట్‌తో ప్రయోగించనున్నారు.ఆ తర్వాత బంగాళాఖాతంలో పారాచూట్ల సాయంతో ల్యాండయ్యే క్రూ మాడ్యూల్‌ను తిరిగి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తారు. ఈ ప్రయోగం మొత్తం సుమారు పది నిమిషాల్లో పూర్తవుతుంది.

ప్రయోగం ఇలా జరుగుతుంది..

  • టీవీ–డీ1 రాకెట్ ను 17 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి .. దాని ఎగువ కొన భాగంలో అమర్చిన ‘క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం’ను మళ్లీ కిందకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.
  • ఈ ప్రయోగంలో రాకెట్ సెకనుకు 400 మీటర్ల వేగంతో దూసుకెళుతుంది. అది నింగిలోకి బయల్దేరాక, అకస్మాత్తుగా వెనక్కి వచ్చే సిగ్నల్స్ ను దానికి ఇస్తారు. దీన్నే ‘అబార్ట్‌’ మెసేజ్ అంటారు.
  • అబార్ట్ మెసేజ్ అందిన వెంటనే రాకెట్‌ శిఖరభాగంలో అమర్చిన ‘క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం’  విడిపోతుంది.  భూమికి 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ ఉండగా ఇది జరుగుతుంది.
  • విడిగా జర్నీ ప్రారంభించే ‘క్రూమాడ్యూల్‌ ఎస్కేప్‌ సిస్టం’ .. దానిలోని 10 ప్యారాచూట్ల సాయంతో శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న  బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది.
  • బంగాళాఖాతంలో అప్పటికే సిద్ధంగా ఉండే కోస్టల్‌ నేవీ సిబ్బంది ఒక ప్రత్యేక బోట్‌లో వెళ్లి క్రూమాడ్యూల్‌ ను సురక్షితంగా రికవర్ చేస్తారు. 531.8 సెకన్లలో ఈ ప్రయోగాన్ని పూర్తి చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

గగన్ యాన్ ఎందుకు ?

  • మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం ఇస్రో చేపడుతున్న కార్యక్రమమే గగన్‌యాన్.
  • 2025 మార్చినాటికి ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో మూడు రోజులు ఉంచి, సురక్షితంగా భూమి మీదికి తిరిగి తీసుకురావడమే మానవసహిత గగన్ యాన్ ప్రయోగం అంతిమ లక్ష్యం.
  • ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
  • ఈ 20 రకాల పరీక్షల్లో భాగంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్‌ ప్రయోగాన్ని ఇవాళ నిర్వహిస్తున్నారు.
  • ఈ ప్రయోగాలన్నీ విజయవంతంగా పూర్తయితే 2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నారు.

Also Read: Delta Force : ఇజ్రాయెల్‌లో అమెరికా ‘డెల్టా ఫోర్స్’ .. ఏం చేయబోతోంది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gaganyaan astronauts
  • Gaganyaan Mission
  • Gaganyaan project 2024
  • Gaganyan
  • Test Flight

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd