HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >G20 Summit Full List Of Leaders Attending Meet

G20 Summit : G20 సదస్సుకు సభ్య దేశాల అధినేతలు ఎవరెవరు వస్తున్నారో..ఎవరెవరు రావడం లేదో తెలుసా..?

బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫిమియో

  • By Sudheer Published Date - 04:00 PM, Fri - 8 September 23
  • daily-hunt
G20 Summit Full List Of Leaders Attending Meet
G20 Summit Full List Of Leaders Attending Meet

మరికొద్ది గంటల్లో ఢిల్లీ లో G20 సమావేశాలు (G20 Summit) జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ప్రపంచ అగ్ర దేశాల ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. వారికీ ఎక్కడ..ఏ విషయంలో చిన్నలోటు రాకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ (India)..అగ్ర దేశాల ప్రతినిధులందరికి ఆహ్వానం పంపింది. అయితే సభ్య దేశాల అధినేతలందరికీ భారత్ ఆహ్వానం పంపినప్పటికీ కొందరు మాత్రం హాజరు కావడం లేదు. రకరకాల కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ఆయా దేశాలు ప్రకటించాయి. వీరిలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉన్నారు. జో బైడెన్ ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరినట్టు అమెరికా వెల్లడించింది.

ప్రస్తుతం ఎవరు వస్తున్నారు..ఎవరు రావడం లేదో చూద్దాం (G20 Summit Full List Of Leaders Attending Meet ) :

1. G20 సదస్సుకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బెైడెన్ (US President Joe Biden) ఇప్పటికే వెల్లడించడం..బయలుదేరడం జరిగింది. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం పడిందనే అంశంపై భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

2. యూకే ప్రధాని రిషి సునాక్ (UK Prime Minister Rishi Sunak) ఈ G20 సదస్సుకి హాజరు కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఆయన…బ్రిటన్ ప్రధాని అయ్యాక ఇండియాకి రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

3. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద (Japan Prime Minister Fumio Kishida) కూడా G20 సమావేశానికి వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా పాల్పడుతున్న సైనిక చర్యను ఈ వేదికగా తీవ్రంగా ఖండించేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు.

4.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau ) ప్రస్తుతానికి ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. అయినా…G20 సదస్సుకి హాజరవుతానని తెలిపాడు.

5. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ( French President Emmanuel Macron) కూడా ఈ సదస్సుకి వస్తున్నట్లు తెలిపారు. సమావేశాలకు హాజరు కావడమే కాదు..ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలూ జరపనున్నారు.

6. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ ( Australia Prime Minister Anthony Albanese ) మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే భారత్‌లోని G20 సదస్సుకి హాజరు కానున్నారు.

7. జర్మన్ ఛాన్స్‌లర్ ఒలఫ్ షోల్జ్‌ ( German Chancellor Olaf Scholz)తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (South Korea President Yoon Suk Yeol ) కూడా G20 సమావేశాలకు హాజరు కానున్నారు.

8. అలాగే సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస (South Africa President Cyril Ramaphosa ), టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్‌ ( – Turkey President Recep Tayyip Erdogan ) G20 కి హాజరుకాబోతున్నారు.

ఇక రానివారు ఎవరంటే..

1. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) G20 సదస్సు కు హాజరు కావడం లేదని ప్రకటించింది చైనా. ఆయనకు బదులుగా ఆ దేశానికి ప్రతినిధిగా కీలక నేత లీ క్వియాంగ్ రానున్నారు. 2008లో తొలిసారి G20 సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడు సదస్సు జరిగినా చైనా అధ్యక్షుడు హాజరయ్యారు. కానీ ఈసారి మాత్రం డుమ్మా కొట్టారు.

2. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ప్రధాని మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) మాట్లాడుతూ వచ్చారు. అయితే ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు పాల్పడినందుకు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. విదేశాలకు వెళ్తే అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆయన ఇండియాలోని G20 సదస్సుకి హాజరు కావడం లేదని ప్రకటించారు.

3. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాన్‌షెజ్‌ (Pedro Sanchez)కి కరోనా బారినపడ్డారు. అందుకే G20 సదస్సుకి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు. మెక్సికో అధ్యక్షుడు యాండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఆబ్రడార్ కూడా హాజరు కావడం లేదు.

Read Also : G20 summit Budget : జీ20 కోసం కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం ఢిల్లీ కి బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫిమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, దక్షిణ కొరియా అధ్యక్షుడు సహా 20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు చేరుకోనున్నారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ న్యూఢిల్లీ చేరుకోగా.. విమానాశ్రయంలో మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం అమెరికా నుంచి భారత్‌కు బయలుదేరగా.. ఆయన ఈరోజు సాయంత్రం 7 గంటలకు భారత్ చేరుకునే అవకాశం ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Full List Of Leaders Attending g20 summit
  • g20 summit
  • G20 summit 2023
  • g20 summit new delhi

Related News

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd