Car Rams Mayor House : మేయర్ ఇంటిపై కారుతో ఆత్మాహుతి దాడి.. ఏమైందంటే ?
పారిస్‌లోని ఒక పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంట్లోకి నిరసనకారులు కారుతో దూసుకెళ్లారు.
- By Pasha Published Date - 01:53 PM, Sun - 2 July 23
Car Rams Mayor House : ట్రాఫిక్ సిగ్నల్ ను ఉల్లంఘించి దూసుకుపోతున్న 17 ఏళ్ల బాలుడు నహెల్ ఎమ్‌ని పోలీసులు కాల్చి చంపిన ఘటనతో ఫ్రాన్స్ ఇంకా అట్టుడుకుతోంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా గత 5 రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈక్రమంలో పారిస్‌లోని ఒక పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ఇంట్లోకి ఒక నిరసనకారుడు మంటల్లో కాలుతున్న కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ భార్య, పిల్లలు గాయపడ్డారు.
Also read : Floating Restaurant : ఇండియాలో మరో తేలియాడే రెస్టారెంట్.. టూర్ ప్యాకేజ్ వివరాలివీ
Cette nuit, un cap a été franchi dans l'horreur et l'ignominie. Mon domicile a été attaqué et ma famille victime d'une tentative d’assassinat.
Ma détermination à protéger et servir la République est plus grande que jamais. Je ne reculerai pas. #PasPourRien #Emeutes ⤵️ pic.twitter.com/9HW1eAFCXN
— Vincent Jeanbrun (@VincentJeanbrun) July 2, 2023
ఈ విషయాన్నిట్విట్టర్ వేదికగా మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ వెల్లడించారు. “ఆందోళనకారులు మాపై హత్యాయత్నం (Car Rams Mayor House) చేశారు. ఇది పిరికి చర్య. మేం శనివారం రాత్రి నిద్రలో ఉండగా ఈ ఘటన జరిగింది” అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఫ్రాన్స్ లో జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రభుత్వం 45,000 మంది పోలీసులను మోహరించింది.
Related News
CM Jagan : అదే జరిగితే జగన్ అక్కడిక్కడే మరణించేవారట – పోసాని
ఒకవేళ గులకరాయి కంటికి తగిలి ఉంటే జగన్ స్పాట్లోనే చనిపోయేవారని పోసాని చెప్పుకొచ్చారు