BRS Party: భారత రాష్ట్ర సమితిలో చేరిన మాజీ టీచర్ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి
- By Balu J Published Date - 11:11 AM, Fri - 27 October 23

BRS Party: మాజీ టీచర్ ఎమ్మెల్సీ, పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం పూర్వ నాయకులు బి మోహన్ రెడ్డి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బిఆర్ఎస్ లో చేరినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. తిరిగి అధికారంలోకి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సారధ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాల పైన కలిసి పని చేసేందుకు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డిని సాధారణంగా కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.