Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో కీలక ఆధారాలు లభ్యం..!!
జూబ్లీహిల్స్ ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బెంజ్, ఇన్నోవా కార్లలో ఫోరెన్సిక్ క్లూస్ టీం ఆధారాలను సేకరించింది.
- By hashtagu Published Date - 12:18 PM, Mon - 6 June 22

జూబ్లీహిల్స్ ఘటన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించారు. నిందితులు ఉపయోగించిన బెంజ్, ఇన్నోవా కార్లలో ఫోరెన్సిక్ క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇన్నోవా కారులో నిందితుల వీర్య నమూనాలను ఫోరెన్సిక్ బృందం గుర్తించి… రెండు కార్లలో బాధితురాలి వెంట్రుకలను గుర్తించిన ఫోరెన్సిక్ బృందం…నమూనాలను FLSకు పంపించింది. ఫింగర్ ప్రింట్స్ తోపాటు..ఓకారులో దొరికిన బాధితురాలి చెప్పు..చెవి రింగును క్లూస్ టీం గుర్తించింది.
కార్లలో దొరికిన ఆధారాలను వేర్వేరు కవర్లలో క్లూస్ టీం సీజ్ చేసింది. ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత పోలీసులు ఇన్నోవా కారును స్వాధీనం చేసుకుంది. ఇన్నోవా కారులో ఆనవాళ్లతోపాటు ఆధారాలు చెరిపివేసే క్రమంలో నిందితులు వాహనం చిక్కకుండా మొయినాబాద్ లోని ఓ రాజకీయనేత ఫాంహౌస్ వెనక దాచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారు నెంబర్ కూడా గుర్తుపట్టకుండా చేసినట్లుగా తెలుస్తోంది.
కాగా ఈకేసులో పోలీసులు ఇప్పటివరకు నలుగురు నిందితులు అరెస్టు చేశారు. మరోనిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే ఈ కేసులో ఓ ఎమ్మెల్యే కొడుకుకు సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే కేసులో ఫోన్ సిడిఆర్, సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..FSLరిపోర్టు ఈ కేసులో కీలకంగా మారే ఛాన్స్ ఉంది.