Big Saving Day’s Sale by Flipkart : ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్
ఈ కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ (Flipkart) మరోసారి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ కార్యక్రమాన్ని ప్రకటించింది.
- Author : Maheswara Rao Nadella
Date : 15-12-2022 - 12:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ కామర్స్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ (Flipkart) మరోసారి డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల 16న మొదలయ్యే ‘బిగ్ సేవింగ్ డేస్’ (Big Saving Day’s) సేల్ 21వ తేదీన ముగుస్తుంది. క్రిస్ మస్ (Christmas) పర్వదినం నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఈ సేల్ ను ప్రకటించింది. ముఖ్యంగా ఈ ‘బిగ్ సేవింగ్ డేస్’ (Big Saving Day’s) సేల్ లో స్మార్ట్ ఫోన్ల పై మంచి డిస్కౌంట్స్ ను ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఆఫర్ చేయనుంది. మరెన్నో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపైనా ఆఫర్లు ప్రకటించనుంది. ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగా డిస్కౌంట్ సేల్ ఇప్పటికే మొదలైంది. రూ.5,000 అంతకుమించి షాపింగ్ చేసే వారికి బ్యాంకు కార్డులపై అదనపు ఆఫర్లు ఉన్నాయి. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ పై 10 శాతం, గరిష్ఠంగా రూ.1250 తగ్గింపు ఇస్తోంది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై 10 శాతం (రూ.1,250), కోటక్ బ్యాంక్ డెబిట్ కార్డ్ పై 10 శాతం (రూ.1,250) వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ కార్డు ఉన్న వారికి 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.
Also Read: Relationship Tips : ఈ 5 విషయాలను తెలుసుకున్న తరువాతే రిలేషన్ షిప్ లోకి వెళ్ళండి..